📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: టీటీడీ భక్తులకు కొత్త విధానంలో ఏరోజుకారోజే దర్శనం

Author Icon By Anusha
Updated: August 8, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూలైన్ల కష్టాలు, వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలకమైన పథకాన్ని అమలు చేయడానికి ముందు అడుగు వేసింది. ఇప్పటికే ఉన్న శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust) టికెట్ల విధానాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి టీటీడీ అధికారులు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు.ప్రస్తుతం తిరుమలలో ప్రతిరోజూ 800 శ్రీవాణి టికెట్లు ఆఫ్లైన్ పద్ధతిలో భక్తులకు కేటాయిస్తున్నారు. ఒక్కొక్క శ్రీవాణి టికెట్ ధర రూ.10,500 కాగా, ఇందులో రూ.10,000 శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా, మిగతా రూ.500 దర్శన సేవకు వసూలు చేస్తారు. ఈ టికెట్ ద్వారా భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం (వీఐపీ దర్శనం) పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ టికెట్లను పొందేందుకు భక్తులు తెల్లవారు జామున నుంచే క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం, గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వల్ల తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

దర్శనానికి వెళ్లే సమయంలోపుగా ఏ సమయంలోనైనా

ఉదయాన్నే ఈ టోకెన్లు పొందిన భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా వారి ఇతరత్రా పనులు చూసుకుని దర్శనానికి వెళ్లే సమయంలోపుగా ఏ సమయంలోనైనా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ఉదయాన్నే క్యూలైన్లో వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ అనే పద్ధతిలో 800 మంది భక్తులకు టోకెన్ తరహాలో డిజిటల్ కంకణాన్ని (Digital bracelet) చేతికి కడతారు. అందులో సీరియల్ నెంబర్ తో పాటు భక్తుల వివరాలు కూడా సిస్టంలో నమోదు చేసిన అనంతరం పంపిణీ చేస్తారు. మరో వారం రోజులు లోపుగా ఈ తాజా నిర్ణయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు.‌

TTD:

శ్రీవారి దర్శనాన్ని

ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను పొందేందుకు తిరుమలలోని హెచ్ వి డి సి ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధునికరించిన కార్యాలయాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇక్కడ శ్రీవాణి టికెట్లను తీసుకున్న రోజు కాకుండా మరుసటి రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పించే పద్ధతికి స్వస్తి పలికి ఏరోజుకారోజు ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రం నాలుగు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించే విధంగా ఇటీవలే మార్పులు తీసుకొచ్చారు.అయినప్పటికీ రోజు రోజుకి శ్రీవాణి టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది‌. ఈ టికెట్లను పొందేందుకు ఉదయం 6 గంటల నుండి భక్తులు క్యూ కడుతున్నారు.

అధికం కావడం

అయితే టీటీడీ మాత్రం ఉదయం 10 గంటలకు టికెట్ల పంపిణీ ప్రారంభిస్తోంది. నాలుగు లైన్లతో కూడిన టికెట్ల కౌంటర్లను శ్రీవాణి టికెట్లు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తుల తాకిడి అధికం కావడం చివరకు ఎనిమిది వందల టికెట్లు కేటాయింపు పూర్తయి మిగిలిన వారికి మొండి చేయి చూపాల్సి రావడం పై టీటీడీ అధికారులకు ఒక విధంగా ఒత్తిడి ఏర్పడుతోంది.‌ ఒత్తిడి మాట ఎలా ఉన్నా భక్తులకు గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా శ్రీవాణి టిక్కెట్ల కేటాయింపుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి పది నిమిషాల్లో టికెట్లు పొంది సౌకర్యంగా దేవుడు దర్శనానికి వెళ్లే విధంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లు చేపట్టారు.

టీటీడీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

టీటీడీ ప్రధాన కార్యాలయం తిరుపతి నగరంలో ఉంది, ఇది చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

శ్రీవాణి టికెట్ అంటే ఏమిటి?

శ్రీవాణి టికెట్ అనేది టీటీడీ ద్వారా అందించబడుతున్న ఒక ప్రత్యేక విఐపీ దర్శన టికెట్. దీని విలువ ₹10,500. ఇది ఆలయ భూముల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఫండ్‌కు విరాళంగా ఉంటుంది. దీని ద్వారా ప్రత్యేక దర్శనంలో వేగంగా దర్శనం కల్పిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/how-long-to-fight-for-justice/andhra-pradesh/527830/

Breaking News latest news offline booking Srivani queue Srivani Tickets Sudarshan token Telugu News tirumala Tirumala Darshan token system TTD TTD latest updates Venkateswara Swamy VIP darshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.