📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

TTD: ఆకలికి చోటే లేని పవిత్ర స్థలం తిరుమల

Author Icon By Aanusha
Updated: January 12, 2026 • 9:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజుకు మూడు లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం

”వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. తిరుమల అంటే కడుపు నిండే క్షేత్రం. ఆకలి అనేది ఇక్కడ భక్తుడికి తెలియదు.శ్రీవారి కృపతో పాటు, టీటీడీ (TTD) అన్నప్రసాద విభాగం నిర్వహిస్తున్న మహత్తర అన్నప్రసాద వ్యవస్థ ద్వారా, ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల మంది భక్తులు తృప్తికరమైన భోజనం స్వీకరిస్తున్నారు.భక్తుల ఆకలే లక్ష్యంగా అన్నప్రసాదం విభాగం కృషి,

Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

టీటీడీ (TTD) అన్న ప్రసాదం విభాగం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, అక్షయ, వకుళమాత,అనే మూడు వంటశాలలు24 గంటలు నిర్విరామంగా పనిచేస్తూశ్రీవారి సన్నిధికి వచ్చిన భక్తుడికి, ఆకలి మరిచిపోయేలా అన్నం అందిస్తున్నాయి. వైకుంఠం క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తుడైనా, డైనింగ్ హాల్‌లో కూర్చున్న యాత్రికుడైనా, లేదా బయట ప్రాంతాల్లో వేచి ఉన్నవారైనా, ఎవరూ ఆకలితో ఉండకుండా చూడటమే టీటీడీ లక్ష్యం.

అన్నపూర్ణ నిలయంగా తిరుమల క్షేత్రం:

అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ 74 వేల మంది, అక్షయ వంటశాల రోజుకు 1.48 లక్షల మందికి, వకుళమాత వంటశాల రోజుకు 77 వేల మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తున్నారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎ.న్టీ.రామారావు సంకల్పం

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6వ తేదిన తిరుమలలో శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. 1994 ఏప్రిల్ 1వ తేదిన ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ప్రారంభించడం జరిగింది.

TTD: Tirumala is a sacred place where there is no place for hunger

అన్న ప్రసాద విభాగం రోజువారీ తయారు చేసే అన్న ప్రసాదాల వివరాలు :

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం :

ఉదయం : గోధుమ రవ్వ ఉప్మా/ సూజి రవ్వ ఉప్మా/ సేమియా ఉప్మా/ పొంగలి, చట్ని, సాంబార్.

మధ్యాహ్నం (8 రకాలు) : స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ.

సాయంత్రం (8 రకాలు) : స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ.

అక్షయ వంటశాల :

గోధుమ రవ్వ ఉప్మా/ సొజ్జి రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోట రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తయారు చేస్తారు.భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాలు, ముఖ్యమైన రోజుల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా ఇక్కడ నుండి భక్తుల కోసం పంపిణీ చేస్తారు.

వకుళమాత వంటశాల :

వకుళమాత వంటశాలలో యాత్రికుల వసతి సముదాయం-2, 4, 5లోని భోజనశాలలకు, బయట ప్రాంతాల్లోని కేంద్రీయ విచారణ కార్యాలయం, యాత్రికుల వసతి సముదాయం-1, రామ్ భగిచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం కాటేజీల వద్ద ఉన్న భక్తులకు పంపింణీ చేసేందుకు సాబారన్నం, పెరుగన్నం, ఉప్మా తయారు చేస్తారు.దాదాపు వెయ్యి మంది అన్న ప్రసాద విభాగం సిబ్బంది మరియు శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు ఎప్పటికప్పుడు అంతరాయం లేకుండా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Annaprasadam latest news Sri Venkateswara Swamy Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.