📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: వరుణుడి ఛత్రంలోపుష్పపల్లకిలో పరమాత్ముడు

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: ఆణివార ఆస్థానంరోజు వరుణదేవుడు పలకరింపుతో భారీ వర్షంలో పరమాత్ముడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి (Lord Venkateswara Swamy) ఉత్సవమూర్తులు పుష్పపల్లని అధిరోహించి భక్తులకు అభయమిచ్చాడు. ఆద్యంతం పుష్పపల్లకిసేవ మొదలైనప్పటినుండి
ముగిసేవరకు వర్షం కురవడం విశేషం. సాక్షాత్తు భగవంతుడు వేసవితాపం నుండి సేదదీరినట్లు వర్షం కురవడం భక్తులను పులకింపజేసింది. ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామికి పూలంటే మహాప్రీతి. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం మూలవిరాట్టుకు పూలంగిసేవ వైభవంగా నిర్వహిస్తారు.

TTD: వరుణుడి ఛత్రంలోపుష్పపల్లకిలో పరమాత్ముడు

మహిళా భక్తులు

ఇప్పుడు దేవదేవుడు శ్రీవేంకటేశ్వరునికి ఆణివార ఆస్థానం రోజు సాయంత్రం పుష్పప్రియుడు మలయప్పస్వామి శ్రీదేవిభూదేవు (Sridevi Bhudevi) లతో కలసి పుష్పపల్లకిపై ఊరేగాడు. తిరుమలగిరుల్లో పుష్పాలు అన్నీ శ్రీవారిపసేవకే. అందుకే ఇక్కడ ఆలయంలోనికి వెళ్ళేసమయంలో మహిళా భక్తులు ఎవరూ పుష్పాలు ధరించరు. సువాసనలు వెదజల్లే పుష్పపల్లకి (Flowerpot) ని వాహనంగా చేసుకుని భగవంతుడు ఆపదమొక్కులవాడు భక్తులను ముగ్ధమనోహరుల్ని చేశాడు. వాహనమండపం వద్ద నుండి సాయంత్రం 6గంటలకుజోరువానలోనే మొదలైన పుష్పపల్లకి జరిగింది.

తిరుపతి ప్రత్యేకత ఏమిటి?

తిరుపతి జిల్లా కేంద్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయం, ఇతర చారిత్రక దేవాలయాల వున్నందున “ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని” అని అంటారు. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి.

తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర?

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల కొండలపై ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఇది విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగంలో మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి వెంకటేశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ramayapatnam: రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు

Anivara Asthanam Breaking News flower pallaki Tirupati latest news Pushpa Pallaki Seva Pushpaseva in Tirumala Tirumala Brahmotsavam Tirumala rains TTD festivals Venkateswara Swamy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.