📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: సాగుతున్న కల్తీ నెయ్యి కేసు! సూత్రధారులు ఇంకా దొరకలేదా?

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి 2020 నుండి 2024 వరకు కల్తీనెయ్యి వినియోగించారనే ఆరోపణలపై సిబిఐ సిట్ అధికారుల లోతైన దర్యాప్తు కొనసాగుతూనే ఉందనేది భక్తుల్లో చర్చ మొదలైంది. కల్తీనెయ్యి బాగోతంలో కర్త, కర్మ, క్రియ ఎవరనేది దాదాపు సిట్ ఇప్పటికే ఆధారాలతో తేల్చేసినా సూత్రధారులు ఎవరనేది వెల్లడించకపోవడం వెనుక పెద్ద ట్విస్ట్ ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ కల్తీనెయ్యి(Adulterated butter) కేసు దాదాపు పదకొండునెలలుగా లాగుతూనే ఉన్నారు. సుమారుగా 25మంది వరకు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన సిట్ అధికారులు అసలు కీలక సూత్రధారులను తేల్చడంలో తాత్సారం ఎందుకనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

Read Also:  Tirumala: వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఈ కేసులో తొలినుండి తీవ్రంగానే విచారణ సాగించిన సిట్ బృందం ఏఆర్ డెయిరీ ఎండి రాజశేఖరన్ ఉత్తరాఖండ్ రూర్కే బోలేబాబా డెయిరీకి చెందిన విపినైన్, పోమిలైజైన్, వైష్ణవీడైరీ (పెనుబాక)సిఇఒఅపూర్వ వినయ్కంత్చావ్దాలను అరెస్టుచేసి రిమాండ్కు తరలించింది. ఆపై వారిని సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, డిఐజి మురలీరాంభా బృందం కస్టడీకి తీసుకుని పలు అంశాల పై విచారణ చేసింది. విచారణలో చాలావరకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, టెండర్లు దక్కించుకున్న వెనుక కథనడిపిన పెద్దల గుట్టువిప్పినట్లు అప్పట్లోనే గుప్పుమంది.

The ongoing adulterated ghee case! Haven’t the perpetrators been found yet?

ధర్మారెడ్డిని రెండురోజులపాటు సమగ్రంగా విచారణ

ఇప్పుడు ఇటీవల వరుసగా మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో విచారణ చేశారు. దానికంటే ముందే మాజీ టిటిడి(TTD) ఏవి ధర్మారెడ్డిని రెండురోజులపాటు సమగ్రంగా విచారణ చేశారు. ఇందులో అధికారులు, తన ప్రమేయం ఏమీ లేదని అంతా బోర్డు కొనుగోళ్ళ కమిటీ చెప్పినట్లే చేశామని వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు సూబ్బారెడ్డి కూడా అధికారులు నిర్ణయించిన అంశాలను బోర్డు ఆమోదించడమే తరువాయి. అని తనదైన శైలిలో వివరణ ఇచ్చారనేది సమాచారం.

కల్తీనెయ్యి కేసులో మరోదఫా

ఈ నేపధ్యంలో మళ్ళీ ఇప్పుడు కల్తీనెయ్యి కేసులో మరోదఫా మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని, మాజీ ఇఒ ధర్మారెడ్డిని సిట్ విచారణ చేయనుందనేది తెలుస్తోంది. మరోసారి సిట్ విచారణకు పిలిస్తే సిట్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉండబోతాయనేది కూడా పెద్ద సందిగ్ధత నెలకొంది. కల్తీనెయ్యిలో ఆ ఇద్దరు హాజరై నోరు విప్పితే ఎలాంటి పరిణామాలు జరగబోతాయో అనేది కూడా ఉత్కంఠగా మారింది. కల్తీనెయ్యి విషయంలో 2020-24వరకు ఏం జరిగిందనేది మాజీ ఇఒ సమగ్రంగా ఆధారాలతో సిట్కు వాంగ్మూలం ఇచ్చారనేది తెలిసింది.

గత ఐదేళ్ళలో 215కోట్లరూపాయలకు పైగా విలువైన 68.17 లక్షల కిలోల కల్తీనెయ్యి సరఫరా చేసినట్లు తేలిందని డిఐజి మురళీరాంభా ఆ కోణంలో ఎలా కీలక ఆధారాలు రాబట్టనున్నారనేది అందరిలోనూ ఉత్కంఠరేపుతోంది. టిటిడికి కల్తీనెయ్యి సరఫరా బాగోతం డిసెంబర్ ఆఖరుకు పూర్తిగా తేల్చేవనిలో సిట్ వేగవంతమైన విచారణ సాగిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Adulterated Ghee Case Andhra Pradesh new Crime News Fake ghee scam Food adulteration sit investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.