📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: అలిపిరి పాదాలమండపంలో ఆలయ శుద్ధి

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ అందాల్ (గోదాదేవి) సన్నిధి,తిరుపతి అలిపిరి వద్ద ఉన్న పాదాలమండపం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) లో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. మంగళవారం ఉదయం పాదాల మండపంలోని ఆండాల్ అమ్మవారి(గోదాదేవి) సన్నిధి, పెరియాళ్వార్సన్నిధి, సన్ని లక్ష్మీనారాయణస్వామి (Lakshminarayana Swamy) సన్నిధిలలో మూలవిరాట్టులకు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి సుంగధపరిమళ జలంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

TTD: అలిపిరి పాదాలమండపంలో ఆలయ శుద్ధి

దర్శనం

ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ విఆర్ శాంతి, ఎఇఒ ఏ. భాస్కర్నారాయణచౌదరి, సిబ్బంది, అర్చకులు పాల్గోన్నారు.

తిరుమల పూర్వపు పేరు ఏమిటి?

తిరుమల కొండను పూర్వకాలంలో ఎన్నో పేర్లతో పిలిచేవారు. వాటిలో కొన్ని ప్రాచీన పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:తిరువేంగడము (Tiruvengadam)వడవేంగడము (Vada Vengadam) — ఇవి తమిళం నుంచి వచ్చిన పేర్లు.వేంకటాద్రి (Venkatadri) — ఇది సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన పేరు.

అలిపిరి మెట్లు ఎన్ని ఉన్నాయి?

తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంగా వెళ్లే దారిని అలిపిరి మెట్లు అని పిలుస్తారు. ఇది ఒక పురాతన మార్గం, భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.ఈ మార్గంలోమొత్తం 3,550 మెట్లు ఉన్నాయి.దీని పొడవు సుమారు 12 కిలోమీటర్లు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: World Food India-2025 : వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా భాగస్వామిగా ఏపీ

Alipiri Andal Temple Godadevi Koil Alwar Thirumanjanam Lakshmi Narayana Swamy latest news Padala Mandapam Sri Venkateswara Temple Telugu News tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.