📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: TTD: కేసులోని వారందరికీ భద్రత కల్పించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు

Author Icon By Rajitha
Updated: November 19, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల: పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు సంచలనం కలిగించిన తిరుమల (Tirumala) పరకామణి భవనంలో చోరీ కేసు విచారణ తుదిదశకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరై రెండోసారి విచారణకు వస్తున్న పూర్వ ఏవిఎస సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకుంది. ఈ కేసులో నిందితులు, సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రవికుమార్ తో బాటు సాక్షులు అందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని రాష్ట్ర సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ను మంగళవారం ఆదేశించింది.

Read also: Tirumala: పరకామణికేసులో నిష్పాక్షిక విచారణ

Security should be provided to all those involved in the case

వారికి ఎలాంటి హాని కలగకుండా

TTD: కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. విచారణ సమయంలో కూడా అనవసర ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధన్యాతనివ్వాలని సూచించింది. పరకామణి చోరీ కేసు విచారణ వేగంగా సాగుతున్న సమయంలో ఇటీవల పూర్వ ఏవిఎసి సతీశకుమార్ అసహజంగా మరణించడం తీవ్ర కలకలం రేపింది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు చూసినా ఆ తరువాత హత్యగా నమోదైంది. ఈ పరిణామాల నేపధ్యంలో సాక్షుల భద్రతకు ప్రాధాన్యత నివ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది తదుపరి డిసెంబర్ 2వతేదీకి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే సిఐడి అధికారులు ఈ కేసులో దర్యాప్తును కూడా హైకోర్టుకు తెలిపినట్లు తెలిసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

High court latest news parakamani case Telugu News tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.