📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: ఆగష్టు 8న టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం..28న సద్గమయ కార్యక్రమం

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో ఆగస్ట్ 8వతేదీ శుక్రవారం సౌభాగ్యం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయా లను సందర్శించే మహిళలకు గాజులు, పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించే ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని రూపొందించారు. సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళేందుకు, విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పేందుకు ఈనెల 28న సద్గమయ కార్యక్రమం ప్రారంభం కానుంది. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏడాదిపాటు చేపట్టే పలు కార్యక్రమాలతో రూపొందించిన బ్రోచరు మంగళవారం మధ్యాహ్నం అన్నమయ్యభవనం (Annamayya Bhavan) లో ఆవిష్కరించారు. టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు, టిటిడిఇ ఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, జెఇఒ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు భానుప్రకాశరెడ్డి, సి.దివాకర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పనబాకలక్ష్మి, శాంతారాం, నర్సిరెడ్డి పలువురు బోర్డు సభ్యులతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు.

TTD

నూతన కార్యక్రమాలు

ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు మాట్లాడుతూ టిటిడి . ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన కార్యక్రమాలు సనాతన హిందూ ధర్మవ్యాప్తికి దోహదపడుతాయన్నారు. సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళేందుకు, ఈ బ్రోచర్ ఉపయోగపడుతుందన్నారు. ఆగస్ట్ 8న సౌభాగ్యం, అక్టోబర్ 2వతేదీ మన వారసత్వం, ఆగస్ట్ 15న సన్మార్గం, ఆగస్ట్ 31న హరికథవైభవం, అక్టోబర్ 12న అక్షరగోవిందం, డిసెంబర్ 1వతేదీ భగవద్గీతానుష్టానం, బోధన, 2026 వేసవిసెలవుల్లో 16సంవత్సరాల లోపు పిల్లలకు సంప్రదాయ భజన (Traditional bhajan) పై భజే శ్రీనివాసం, సంప్రదాయ భజన శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. వీటితో బాటు వన నిధి, గిరిజనార్థనం వంటి కార్యక్రమాలను రూపొందించడం చక్కగా ఉందన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రభుత్వ నియంత్రణలో ఉందా?

అవును, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రోజుకు ఎంత ఆదాయం పొందుతోంది?

టీటీడీకి హుండీ ద్వారా రోజుకు సగటున రూ. 3 కోట్ల 60 లక్షలు ఆదాయం వస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Vijayawada: నకిలీ మద్యం ముఠా పట్టివేత

Akshatalu distribution Breaking News latest news Sadgamaya program TTD Telugu News TTD bangles flowers turmeric event TTD Hindu temples TTD Saubhagya program women special event Tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.