TTD: 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు, మరియు వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా వెల్లడించింది. భక్తులు ఈ షెడ్యూల్ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ముందస్తుగా బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Read Also :Vasavi Kanyaka Parameswari: వాసవి సంచార పీఠానికి ఘన స్వాగతం

ఆగస్టు 18 నుంచి నవంబర్ ఆర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అత్యధిక డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి తమ టిక్కెట్లను ఖరారు చేసుకోవాలి.
TTD: ఆగస్టు 25న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం & రూమ్‌ల కోటా విడుదల!
ఇతర ప్రత్యక్ష ఆర్జిత సేవా టికెట్లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను టీటీడీ అందుబాటులో ఉంచుతుంది. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
అత్యంత ప్రాధాన్యత కలిగిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని వసతి గదుల (అకామడేషన్) బుకింగ్ కోటాను అందుబాటులోకి తెస్తారు. దళారులు, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోకుండా అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు పొందాలని దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :