📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: భక్తుల అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యత

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

-సాంకేతికత సహాయంతో సకాలంలో శ్రీవారి దర్శనం

తిరుమల : ఆపదమొక్కులవాడా గోవిందా, అనాధరక్షక గోవింద నినాదాలతో తిరుమలకు చేరుకుంటున్న సామాన్యభక్తులకు సాంకేతికత సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని టిటిడి, జె. శ్యామలరావు (J. Shyamala Rao) సూచించారు. తిరుమలేశుని దర్శనార్థం టిటిడి జారీచేస్తున్న పలు రకాల దర్శనాల్లో సర్వదర్శనం, సమయ నిర్దేశిత దర్శనం(ఎస్ఎస్), ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఇడి) దివ్యదర్శనం మార్గాల ద్వారా తిరుమలకు భక్తులు వస్తుంటారని, ఆయా భక్తులకు సాంకేతికత (టెక్నాలజీ) సాయంతో సకాలంలో దర్శనం చేయించడంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. టిటిడిలో ఐటి విభాగం నిర్వహణలో కీలకంగా ఉన్న టిసిఎస్ ప్రతినిధులు, ఐటి అధికారులతో వర్చువల్ సమావేశమయ్యారు. తిరుమలకు వచ్చిన భక్తులు దేవదేవుని దర్శనానికి క్యూలైన్లలో చేరుకున్నప్పటి నుండి దర్శనం అయ్యేవరకు సాంకేతికత ఉపయోగించి స్వామివారి దర్శనం సులభతరం చేయించే అంశానికి పంబంధించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

TTD: భక్తుల అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యత

ప్రణాళికా బద్ధంగా

ఈ అంశంపై నిర్దిష్ట నిర్ణయానికి వచ్చేందుకు టిసిఎస్ ప్రతినిధులు, ఐటి విభాగం ప్రతినిధులు తరచూ సమావేశాలు నిర్వహించి, ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని కోరారు. టిటిడిలో ఇప్పటివరకుఉన్న విధానంలో టిటిడి సిబ్బంది (TTD staff) తో భక్తులను ధృవీకరించడం జరుగుతోందని, సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న మార్పులకు అనుగుణంగా క్యూఆర్ కోడ్, ముఖగుర్తింపు పద్దతి ద్వారా భక్తులను నిర్ధారించే మరింత సమయాన్ని ఆదాచేసే విషయంపై పరిశీలిం చాలన్నారు. భక్తులు క్యూలైన్లో (queue Line) ప్రవేశించనప్పటి నుండి కంపార్టుమెంట్లలో ఎంతసయం ఉంటున్నారని, క్యూలైన్లలో భక్తులు చేరినప్పటి నుండి శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అవుతోందని, ఆలయం నుండి వెలుపలకు రావ డానికి ఎంత సమయం పడుతోందన్నారు.

తిరుమలలో ఏ ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి?

తిరుపతి ఆలయాన్ని చుట్టుముట్టిన అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యాలలో ఒకటి లోపలి గర్భగుడిలో ప్రతిధ్వనించే సముద్ర తరంగాల శబ్దం. తిరుమల సముద్రం నుండి వందల మైళ్ల దూరంలో ఉండటం అసాధారణమైనది, అయినప్పటికీ భక్తులు దేవత విగ్రహం దగ్గర అలల ప్రశాంతమైన శబ్దం వింటామని ప్రమాణం చేస్తారు.

తిరుమలలో ఏ ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి?

తిరుమల కొండలపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది కలియుగ దైవంగా కొలవబడుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం, దాని వెంట్రుకలు, తిరుపతి లడ్డు, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవాలయాలు,భక్తులు సమర్పించే కానుకలు వంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tirumala: మతమార్పిడి కట్టడికి శ్రీవారి ‘పుస్తకప్రసాదం’

Breaking News GovindaChants JShyamalaRao latest news Telugu News TirumalaDarshan TirumalaTTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.