📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD : టీటీడీ కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!

Author Icon By sumalatha chinthakayala
Updated: April 4, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన బోర్డు తీర్మానాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని బీఆర్‌ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్‌ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు.

టీటీడీ బోర్డు చేసిన ముఖ్య తీర్మానాలు ఇవే..

  1. అంతర్జాతీయ ఆలయాల నిర్మాణం: ఇతర దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు.
  2. ఆస్తుల పరిరక్షణ: టీటీడీ ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
  3. న్యాయపరమైన వివాదాలు: టీటీడీ భూముల న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.
  4. హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: టీటీడీ లో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం.
  5. రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు: వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు.
  6. గ్రామాల ఆలయాలకు ఆర్థిక సాయం: అర్ధాంతరంగా ఆగిపోయిన గ్రామాల ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం.
  7. అక్రమాల విచారణ: శ్రీనివాస సేవా సమితి పేరుతో కైంకర్యాల సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం.
  8. పునరుద్ధరణ: టీటీడీ మూలాలున్న ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం.
  9. అనధికార హాకర్ల తొలగింపు: తిరుమలలో అనధికార హాకర్ల తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు.
  10. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయిస్తూ, పూర్వ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం.
  11. టీటీడీ బడ్జెట్: రూ.5,258.68 కోట్లతో 2025-26 బడ్జెట్‌కు ఆమోదం.
  12. గదుల ఆధునీకరణ: రూ.772 కోట్లతో తిరుమల గదుల ఆధునీకరణకు నిర్ణయం. కాగా, టీటీడీ బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు భక్తులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి.
Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news TTD TTD Chairman BR Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.