📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: TTD – బ్రహ్మోత్సవాలను పరిశీలించనున్న ఇస్రో

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 6:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) ఏడాది నిర్వహించబోయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను కొంత కొత్త పద్ధతిలో నిర్వహించనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం మీడియాకు వివరించినట్టు, ఈసారి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, భవిష్యత్తులో నిర్వహణకు కొత్త సాంకేతిక పద్ధతులను అమలు చేయనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు. మతమార్పిడులను అరికట్టే లక్ష్యంతో శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) కు వచ్చే నిధులను ఈ ఆలయాల నిర్మాణానికి వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈనెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా, 24 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

TTD

బ్రహ్మోత్సవాల సందర్భంగా

సెప్టెంబర్ 24న మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బీఆర్‌ నాయుడు ప్రకటించారు.

ఈనెల 28న జరిగే శ్రీవారి గరుడ సేవకు సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తుల రద్దీలో చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు, వారి భద్రత కోసం తొలిసారిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.అంతకుముందు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర బోర్డు సభ్యులతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌-2025ను ఆవిష్కరించారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-mega-dsc-2025-counselling-this-is-the-mega-dsc-posting-counselling-schedule/andhra-pradesh/548481/

Breaking News Hindu Festivals ISRO scientists latest news Telugu News Temple Construction temple management Tirumala Venkateswara Swamy Annual Brahmotsavam TTD Chairman BR Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.