📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు హీరో విశ్వక్‌ సేన్ విజ్ఞప్తి

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
TTD: Hero Vishwak Sen’s appeal to Tirumala devotees

వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని భక్తులందరు తెల్లవారు జామునుంచే పెద్ద ఎత్తున ఆలయాలకి తరలి వెళ్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలోని ఆలయాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ అత్యంత రద్దీతో కిటకిటలాడుతుంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.

Read Also: AP: రైతులకు గుడ్ న్యూస్: కొత్త పాస్ బుక్స్ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది.ఈ పది రోజులూ సమాన పవిత్రత కలదని, ఏ రోజు దర్శనం చేసుకున్నా ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని టీటీడీ (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే తిరుమలకు చేరుకుంటే కేవలం రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులను ఉద్దేశించి హీరో విశ్వక్‌సేన్ ఒక కీలక విజ్ఞప్తి చేశారు.

టోకెన్లు ఉన్నప్పుడే ప్రయాణం చేయాలి

డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందస్తు దర్శన టోకెన్లు ఉన్నప్పుడే ప్రయాణం చేయాలని ఆయన సూచించారు. టికెట్ లేకుండా వెళ్లడం వల్ల అనవసర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, భక్తులు టీటీడీ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్లి ఇబ్బందులు పడొద్దని, టీటీడీ సిబ్బందికి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తీసుకున్న కఠిన నిర్ణయాలపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు అవసరమని టీటీడీ అధికారులు వివరణ ఇస్తున్నారు. భక్తుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Srivari Darshan Telugu News Tirumala Tirupati Devasthanam TTD Vaikunta Ekadashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.