📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

Author Icon By Pooja
Updated: March 15, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో తీపి కబురు అందించింది. కలియుగ వైకుంఠంలో అన్నప్రసాద వితరణను మరింత విస్తృతం చేస్తూ, సరికొత్త అత్యాధునిక అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సహకారంతో రూ.120 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా అంతరాయం కలగకుండా అన్నదాన సేవలను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

Read Also:Tirupati: శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

రిలయన్స్ భారీ విరాళంతో ఆధునిక వంటశాల!

ఈ నూతన భవనంలో కేవలం భోజన శాల మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెడ్రన్ కిచెన్‌ను కూడా నిర్మించనున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా, అన్నప్రసాద తయారీలో ‘ఆటోమేషన్’ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి రుచికరమైన, శుచికరమైన ప్రసాదాన్ని సిద్ధం చేసే అవకాశం కలుగుతుంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గత పర్యటనలో ప్రకటించిన విరాళాన్ని ఈ ప్రతిష్టాత్మక నిర్మాణానికి వినియోగించనున్నారు.

ప్రస్తుతం తిరుమలలో ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వసతులకు తోడుగా, కొత్తగా నిర్మించబోయే రెండు డైనింగ్ హాళ్ల ద్వారా ఒకేసారి వేల సంఖ్యలో భక్తులకు అన్నదానం చేసే వీలుంటుంది. ఈ ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.

త్వరలోనే ఈ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించి, పనులను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులను మెరుగుపరచడంలో భాగంగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

#Annaprasadam #MukeshAmbani #RelianceIndustries #Tirumala #TirupatiNews #ttd

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.