TTD: తిరుమలలో భోగి పండుగ వేడుకలు భక్తుల కోలాహలంతో వైభవంగా సాగాయి. బుధవారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. చలికాలంలో భోగి మంటల వెలుగులు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి.
Read Also: Sankranti: భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భోగి మంటల(Bhogi Celebrations Tirumala) చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ‘గోవిందా… గోవిందా…’ అనే నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగించారు. భక్తుల భక్తిశ్రద్ధలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భోగి సంబరాల అనంతరం ఆలయ ద్వారాలను తెరిచి శ్రీవారికి ధనుర్మాసానికి సంబంధించిన ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. ఉషోదయ సేవ, సుప్రభాత సేవతో పాటు ఇతర నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
భోగి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొనగా, టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భద్రత, పారిశుద్ధ్యం, దర్శన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: