📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD Updates: టీటీడీ అగరబత్తీల కేంద్రం హఠాత్తుగా మూత

Author Icon By Rajitha
Updated: October 14, 2026 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD Updates:శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలోని టీటీడీ అగరబత్తీల కేంద్రం మూతపడింది. 2019 లో బెంగళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి టీటీడీ ఈ పవిత్ర కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీవారి ఆలయాల్లో ఉపయోగించిన పవిత్ర పూలతో 7 రకాల అగరబత్తీల తయారీ చేపట్టారు. భక్తుల నుంచి ఆదరణ పెరగడంతో 2024 లో రెండో ప్లాంట్ ఏర్పాటు చేసి కొత్తగా మరో 3 రకాల ఉత్పత్తులు ప్రారంభించాలని భావించారు. ప్రస్తుతం టీటీడీ అగరబత్తీల తయారీ కేంద్రం మూసివేత కావడం వల్ల నిల్వలు లేక భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Read also: TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

TTD Agarbattis Production Centre Closed

నెలకు రూ.5 కోట్ల వ్యాపారం.. అయినా మూతపడడానికి అసలు కారణం ఇదే!

తిరుమల పరిధిలోని ఆలయాల్లో రోజుకు 25000 అగరబత్తీల ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా సగటున 5 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పాత కంపెనీ ఐదేళ్ల లీజు గడువు 6 నెలల క్రితమే ముగిసింది. పాత కంపెనీకి ఇచ్చిన 6 నెలల అదనపు సమయం ముగిసినా కొత్త టెండర్లపై ఆలస్యం చేశారు. గత నెలలోనే ఆన్‌లైన్ టెండర్ ఖరారైనా నూతన ఏజెన్సీకి అప్పగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఈ జాప్యం వల్ల 149 మంది సిబ్బందికి ఉపాధి కరవైంది.

TTD Updates:149 మంది కార్మికుల భవితవ్యంపై అధికారుల కీలక ప్రకటన!

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబడి పెంచుకునే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అగరబత్తీల కేంద్రం మూతపడడంపై ఎస్వీ గోసంరక్షణశాల సంచాలకులు స్పందించారు. ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. నూతన బోర్డు మీటింగ్ నిర్ణయం ప్రకారం తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు తయారీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. అతి త్వరలోనే ఉత్పత్తిని పునఃప్రారంభించి నిల్వలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agarbattis Andhra Pradesh Devotees News SV Gosamrakshanasala Tenders tirumala Tirumala News Tirupati News TTD TTD Agarbattis TTD Agarbattis Production TTD Tenders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.