📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TTD: తిరుమలలో భద్రతకు ఏఐ టెక్నాలజీ

Author Icon By Pooja
Updated: February 2, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టీటీడీ(TTD) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఆలయం చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. గత నెల రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లో వీటిని పరీక్షాత్మకంగా వినియోగించగా, మంచి ఫలితాలు లభించాయని అధికారులు తెలిపారు.

Read Also: AP: TTD ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ బదిలీ

ఏఐ కెమెరాలు, ముక్కోటి తీర్థం, తెప్పోత్సవాలతో వైభవంగా ఆలయ ప్రాంతం

ఈ ఆధునిక కెమెరాల సహాయంతో భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, భద్రతా ఏర్పాట్లను సమర్థంగా అమలు చేయవచ్చు. అన్ని కెమెరాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. డిసెంబర్, జనవరి నెలల్లో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు వచ్చినప్పటికీ, ఈ సాంకేతికత ద్వారా జనసందోహాన్ని సాఫీగా నియంత్రించగలిగామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం(TTD) నుంచి ఊరేగింపుగా వెళ్లిన అర్చకులు తీర్థంలో శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం వంటి ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి 5,000కు పైగా హాజరుకావడం విశేషం. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.

అదే విధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించగా, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి పుష్కరిణిలో తెప్పపై ఏడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

FaceRecognition Google News in Telugu Latest News in Telugu TempleSecurity

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.