📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: టిటిడి నకిలీ నెయ్యి కేసు

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముగ్గురు నిందితులకు బెయిలు మంజూరు

విజయవాడ : టిటిడికి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ (ఏ3), విపిన్ జైన్ (ఏ4), వైష్ణవి డెయిరీ సిఇఒ అపూర్వ వినయ్ కాంత్ చావడా (ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించా లని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పిటిషనర్లకు న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) (TTD) నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురుకూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. ఈరోజు పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తరువాత న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీని వాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో

టిటిడికి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలే బాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ (ఏ3), విపిన్ జైన్ (ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా (ఏ5) లకు హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. దర్యాప్తుకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావా లని పిటిషనర్లకు న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి)నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టు (High Court) లో పిటిషన్లు దాఖలు చేయగా ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి, ఈరోజు పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల అనంతరం బెంచ్ మీదనే న్యాయమూర్తి జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాల్లలో జగన్ పర్యటన సందర్భంగా ఆయన కారుకిందే పడి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందారు.

TTD: టిటిడి నకిలీ నెయ్యి కేసు

నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జగన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసులను కొట్టి వేయాలంటూ మాజీ సిఎం హైకోర్టును ఆశ్రయించారు. గత వారం సింగయ్య కేసులో జగన్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. దీంతో ఈ వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ట్రోల్పై బెంచ్ మీదనే జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నన్ను గత రెండురోజులునుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు బాగా పనికి వస్తాయంటూ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy), తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులను వచ్చే మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. అంతేకాకుండా తన ముందున్న బెయిల్ కేసుల అన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

Read Hindi Also: hindi.vaartha.com

Read Also: Nimmala Ramanaidu: నిర్దిష్ట ప్రణాళికతో నీటి ప్రాజెక్టులు పూర్తి

#FakeGheeCase #TTDGheeScam Andhra Pradesh High Court bail AP High Court orders Apurva Vinaykant Chawda bail granted TTD accused Boledbaba dairy directors bail fake ghee supply to TTD High Court judgment judicial custody Justice K Srinivas Reddy Pommil Jain Tirumala laddu ghee scam Tirupati temple ghee scam TTD adulterated ghee TTD fake ghee case TTD food scam TTD ghee case investigation TTD ghee suppliers TTD laddu adulteration Vaishnavi Dairy CEO Vipin Jain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.