📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Giri Pradakshina : అరుణాచల గిరి ప్రదక్షిణలో విషాదం

Author Icon By Sudheer
Updated: July 12, 2025 • 7:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)కు వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భక్తుడు విషాదకరంగా హత్యకు గురయ్యాడు. సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే 32 ఏళ్ల యువకుడు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతనిపై దాడికి పాల్పడ్డారు.

తీవ్ర గొడవ.. కత్తితో దాడి

ప్రదక్షిణ చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంతో వచ్చి విద్యాసాగర్‌(Vidyasagar)ను ఢీకొట్టారు. కింద పడిన విద్యాసాగర్ వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో ఆగ్రహించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై విచక్షణలేని దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను అక్కడే ఉన్న ఇతర భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

నిందితుల అరెస్ట్ – కేసు దర్యాప్తు


ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసిన తిరువణ్ణామలై పోలీసులు, నిందితులైన గుగనేశ్వరన్, తమిళరసన్‌లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ హత్యతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గిరి ప్రదక్షిణ వంటి పవిత్ర యాత్రలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తులలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also : Earthquake: ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు

dies Giri Pradakshina Vidyasagar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.