📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Author Icon By Aanusha
Updated: March 5, 2026 • 7:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala: తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ‘ఉగాది ఆస్థానం’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించనున్నారు.

Read Also: Vangalapudi Anitha: హోం మంత్రి అనితకు అస్వస్థత.. ఆందోళన వద్దు

మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మార్చి 17న (మంగళవారం) ‘కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీలో అనాదిగా వస్తున్న ఆచారం.

Tirumala: VIP break darshans cancelled this month!

ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. దీని కారణంగా మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది పర్వదినం సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కావున మార్చి 18న సిఫార్సు లేఖలు సమర్పించే అవకాశం ఉండదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Koil Alwar Tirumanjanam Tirumala Ugadi 2026 TTD VIP Break Darshan Cancel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.