తిరుమల: కలియుగవైకుంఠం తిరుమలలో ఈనెల 25వతేదీ ఆదివారం సూర్యజయంతి(రథసప్తమి) వేడుకలు అంగరంగవైభవంగా(Tirumala) జరగనున్నాయి. ఉదయం 5.30గంటల నుండి రాత్రి 9గంటల వరకు ఒకేరోజు ఏడువాహనాలపై ఏడుకొండలదేవుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో జరిగే అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేకదర్శనాలతోబాటు సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు కూడా టిటిడి రద్దుచేస్తుంది. భక్తులను వైకుంఠమ్ 2 క్యూకాంప్లెక్స్ ద్వారా అనుమతించి దర్శనం కల్పించనున్నారు.
Read Also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
24నుండి టైమ్ స్లాట్ టోకెన్లు నిలుపుదల
ఆలయం ముందు, మాఢవీధుల్లో గ్యాలరీలు, జర్మనేడ్లను ఏర్పాటుచేశారు. ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు. టీ, కాఫీ, పాలు అందించేలా శ్రీవారిసేవకులు, టిటిడి(Tirumala) ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నారు. తిరుమలలో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదనపు పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు. 25వతేదీ పూర్తిగా భక్తులకు ఉదయం నుండిరాత్రి వరకు చలికి, ఎండకు ఇబ్బందులు కలగకుండా మాఢవీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో కూల్పెయింటింగ్, ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. 25వతేదీ ఆదివారం అన్ని ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు దర్శనాలు, బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దుచేశారు. ఆ రోజు ఉదయం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. 24నుండి 26వరకు ఆఫ్లైన్లో సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేశారు. తిరుమలకు అశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీని నిలుపుదలచేశారు. 25వతేదీ ఉదయం 5.30గంటలకు తొలివాహనంగా సూర్యప్రభవాహనం మొదలై ఉదయం 8గంటల వరకు మాఢవీధుల్లో ఊరేగనుంది. ఉదయం 9గంటల నుండి 10గంటల వరకు చిన్నశేషవాహనం, ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం 1నుండి 2గంటల వరకు హనుమంతవాహనం, మధ్యాహ్నం 2గంటల నుండి 3గంటల వరకు చక్రస్నానమహోత్సవం, సాయంత్రం 4గంటల నుండి 5గంటల వరకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8గంటల నుండి 9గంటల వరకు చంద్రప్రభవాహనసేవలు ఆలయ మాఢవీధుల్లో స్వామివారు అధిరోహించి ఊరేగనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: