తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలి యుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యంలో వైకుంఠ ఏకాదశి(Tirumala) పర్వదినం ముందు ముందు మంగళవారం ఉద యం కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు మహాయజంలా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయం అంతటా సుగంధపరిమళ ద్రవ్యంతో శుద్ధి చేశారు.
ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు సాగిన ఈ మహాయజంలో రాష్ట్రమంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనంరామనారాయణరెడ్డి, టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్, బోర్డు సభ్యులు భానుప్రకాశొడ్డి, నరేష్కుమార్, శాంతారాం, సదాశివరావు, టిటిడి సివిఎస్ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఆలయ పేష్కార్ రామకృష్ణ, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గోని ఆలయంలోపల(Tirumala) బంగారువాకిలి నుండి ఉప ఆలయాలు, మహద్వారం వరకు నీటితో శుభ్రంగా కడిగారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంద ద్రవ్యాలు కలగలిపిన పరిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణ చేశారు.
ఉదయం 10గంటలకు ప్రోటోకాల్ విఐపిలకు బ్రేక్ దర్శనం చేయించి నంతరం 11గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈసందర్భంగా ఆలయంలో జరగాల్సిన అష్టదళపాదపద్మారాధన సేవ రద్దయ్యింది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు ముందువచ్చే మంగళవారాల్లో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టడం ఆనవాయితీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: