📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala – శ్రీవారి ఆలయం మినీహుండీలో చోరీ తమిళనాడు వ్యక్తి పట్టివేత

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : సామాన్యభక్తులతో బాటు నిందితుడుగా ఉన్న తమిళనాడు వాసి శ్రీవారిని దర్శించుకున్న తరువాత బంగారుబావివద్ద ఉన్న స్టీల్ హుంఢీ (Steel hopper) లో చోరీచేశాడు. ఈ సంఘటనను సిసి కెమెరా కమాండ్ రూమ్ (Command room) నుండి భద్రత సిబ్బంది గమనించేలోపు అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయం వెలుపలకు వచ్చేసమయంలో భద్రత సిబ్బంది పట్టుకున్నారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. తమిళనాడు (Tamil Nadu) తిరువణ్ణాలికి చెందిన వేణు భక్తుల్లాగే ఆలయంలోనికి వచ్చాడు.

Tirumala

బంగారుబావి వద్ద స్టీల్ హుండీలో

ఆనందనిలయం పక్కనే ఉన్న బంగారుబావి వద్ద స్టీల్ హుండీలో సాధారణ భక్తుడిలా కానుకలు వేసేలా నటిస్తూ అందులోంచి 4వేల రూపాయలు నగదును చోరీ చేశాడు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిశితంగా గమనించిన భద్రత సిబ్బంది వెంటనే ఆలయంలోని విజిలెన్ సిబ్బంది కి సమాచారం అందించారు. అతనిని పట్టుకుని తిరుమల (Tirumala) 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను జేబుదొంగతనాలకు అలవాటుపడి ఇప్పుడు ఏకంగా ఆలయం లోపల మినీహుంఢీలోనే చోరీచేయడంతో ఆలయంలో భద్రతపై మరింత పటిష్టంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/former-cm-jaganmohan-reddys-false-campaign-against-medical-colleges-home-minister-anitha/andhra-pradesh/546404/

Bangaru Bavi Breaking News caught escaping CCTV monitoring command room latest news security staff steel hundi Tamil Nadu devotee Telugu News temple theft tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.