📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: మతమార్పిడి కట్టడికి శ్రీవారి ‘పుస్తకప్రసాదం’

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దళితవాడలు, ఏజెన్సీప్రాంతాల్లో ఉచిత పంపిణీకి టిటిడి కార్యాచరణ

తిరుమల : తెలుగురాష్ట్రాల్లో మతమార్పిడులను సమూలంగా అరికట్టి, సనాతన ధర్మం వైభవం, విశిష్టతపై అవగాహన కలిగించేందుకు హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో హిందూ మతంపై విశ్వాసం, హిందూ ధర్మంపై నమ్మకం కలిగించేలా టిటిడి పుస్తకప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని దళితవాడలు, మారుమూల గ్రామాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu), హిందూ ధర్మం, హింధూ మతం పరిరక్షణకు టిటిడి మరింత దృష్టి సారించాలని సూచించారు.

పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు

ఇప్పటికే టిటిడి పాలకమండలి చైర్మన్ బిఆరా నాయుడు, టిటిడి ఇఒ జె. శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ఆ దిశగా అడుగులేస్తున్నారు. పుస్తకప్రసాదం కార్యక్రమంతో మతమార్చి డులకు అడ్డుకట్టవేయొచ్చని ఆలోచన చేశారు. టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్ విభాగాన్ని భాగస్వామ్యం చేస్తూ హిందూ మతం వ్యాప్తి, మతం గురించి మరింతగా విశ్వాసం కలిగించేలా పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. దేశం, నలుమూలల నుండేగాక విదేశాల నుండి ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్ల (Compartments) లో ఈ పుస్తకాలను వితరణ చేసేందుకు నిర్ణయించారు. ఈ పుస్తకాలను టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుకు టిటిడి అధికారులు అందజేశారు. రాష్ట్రంలో మతమార్పిడులను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంగా టిటిడి తమవంతు భాగస్వామ్యం అయ్యి ముందుకు కదులుతోంది.

Tirumala: మతమార్పిడి కట్టడికి శ్రీవారి ‘పుస్తకప్రసాదం’

హిందూమతంపై విశ్వాసం కలిగించేలా

దేవదేవుడు ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతోబాటు హిందూ మతంనుండి అన్యమతంలోనికి జరుగుతున్న మత మార్పిడులను అరికట్టడానికి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సూచనలతో టిటిడి పుస్తకప్రసాదం అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. ప్రధానంగా దళితవాడలు, మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మన సనాతన ధర్మంయొక్క ప్రాధాన్యత, శ్రీవారి వైభవం, హిందూ సాంప్రదాయం, మహాపురుషుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ముద్రించిన టిటిడి పంపిణీ చేయబోతోంది. అలాగే తిరుమలకొండపై వైకుంఠం క్యూకాంప్లెక్స్ (Vaikuntam Q Complex) లలోని కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనంకోసం వేచివుండే భక్తులకు నిరంత రంగా పుస్తకాలను వితరణచేయనున్నారు. పుస్తకప్రసాదంగా 1.శ్రీవేంకటేశ్వరవైభవం, 2. విష్ణు సహస్ర నామం, 3. వేంకటేశ్వర సుప్రభాతం, 4. భజగోవిందం, 5. లలితా సహస్రనామం, 6. శివస్తోత్రం, 7. భగవ ద్గీత, 8. మహానీయులుచరిత్ర తదితరపుస్తకాలను ఛైర్మన్ నాయుడు ధర్మప్రచారపరిషత్ అధికారులకు అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nellore: రొట్టెల పండుగకు 4 లక్షల మంది రాక

తిరుమల తిరుపతి చరిత్ర?

ఆలయ పురాణం ప్రకారం, శ్రీనివాసుడు శ్రీ వరాహస్వామి నుండి భూమిని బహుమతిగా కోరాడు, దానిని ఆయన వెంటనే ప్రసాదించాడు . ప్రతిగా, శ్రీనివాసుడు ఆలయాన్ని సందర్శించే భక్తులందరూ మొదటి దర్శనం, పూజ, నైవేద్యాలను చెల్లిస్తారని హామీ ఇచ్చే ఒప్పంద పత్రం అతనికి అందించాడు.

తిరుపతి బాలాజీ టెంపుల్ విస్తీర్ణం ఎంత?

తిరుమల సముద్ర మట్టానికి 3,200 అడుగుల (980 మీ) ఎత్తులో ఉంది. దాదాపు 10.33 చదరపు మైళ్ళు (26.8 కిమీ2) విస్తీర్ణంలో ఉంది.

HinduDharmaAwareness latest news SanatanaDharma Telugu News TirumalaTTD TTDInitiative

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.