Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుంటున్న ప్రముఖులు, విఐపి బ్రేక్ ప్రోటోకాల్ ముఖ్యులు అందుకునే వేదపండితుల ఆశీర్వచనాలకు మేల్ఛాట్ వస్త్రాల కొరత కనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రోటోకాల్ విఐపి బ్రేక్ లో పదిమంది వరకు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేదాశీర్వచనం అందుకోవడం జరుగుతుంది. ఇందుకు రూ 3వేలు వేదాశీర్వచనం సేవా టిక్కెట్ ముందుగానే కొనుగోలుచేస్తారు. ఈ టిక్కెట్లను తిరుమలలో బ్రేక్ టిక్కెట్లతో బాటు అదనపు ఇఒ కార్యాలయం లో జారీచేస్తారు.
Read also: Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు
రోజువారీగా ఇరవైవరకు వేదాశీర్వచనం టిక్కెట్లు జారా అవుతున్నా రెండురోజులు మేల్చాటవస్త్రాలు కొరతతో ఈ సంఖ్య కుదించినట్లు ఆలయ వర్గాల సమాచారం. బుధవారం కేవలం ఐదు టిక్కెట్లు మాత్రమే వేదాశీర్వచనం మంజూరైందనేది తెలుస్తోంది. ఇందుకు ఈ సేవా భక్తులకు అందజేసే పట్టువస్త్రాలు అవసరమైన మేరకు నిల్వలేకపోవడమే కారణమనేది చెబుతున్నారు. గతంలో ఈ వస్త్రాల కొనుగోళ్ళలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, తక్కువ ధరకే కొనుగోలుచేయాల్సిన మేల్చాట్వస్త్రాలను అధిక ధరకు టెండర్లు ఇచ్చినా నాసిరకం వస్త్రాలు అనేది భక్తుల్లో ఆరోపణలు. దీంతో గత టెండర్లను ఇప్పుడు టిటిడి బోర్డు రద్దుచేసిన విషయం తెలిసిందే.
ప్రతిరోజూ తిరుమలకు పెద్దసంఖ్యలోనే ప్రోటోకాల్ ప్రముఖులు, ప్రముఖులు వస్తుంటారు. తిరుమలకు వచ్చిన సందర్భంలో వారికి మర్యాదపూర్వక స్వాగతం పలకడంతోబాటు వేదాశీర్వచనం చేసుకుంటే మేలాఛాట్ వస్త్రాలను బహుమానంగా అందిస్తారు. మార్కెట్లో నాణ్యమైనవి కూడా 300-350రూపాయలు ఉండగా ఈ శాలువలను గత టిటిడి బోర్డులోని పెద్దలు, ప్రొక్యూర్మెంట్సెల్ కమిటీలోని అధికారులు ఏకంగా నాలుగురెట్లు పెంచి 1,300రూపాయలు వెచ్చించి కొనుగోలుచేశారనేది ఇటీవల ప్రస్తుత బోర్డు తేల్చిన లెక్కలు. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దుచేయడంలో శాలువాల కొరత ఏర్పడింది. ఇప్పటికే ఈ టెండర్లు ఆమోదించాల్సి ఉండగా బోర్డు సమావేశం జాప్యం కారణంగా మేలా ఛాట్వస్త్రాల కొనుగోళ్ళ టెండర్లకు కాలయాపన జరిగింది. ఈనెల 28వతేదీ జరగనున్న టిటిడి బోర్డు సమావేశంలో ఈ అంశంచర్చకు రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: