📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: టైమ్ స్లాట్ టోకెన్ భక్తులకు గదులు ఇవ్వరు!

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.300 ఆన్లైన్ టిక్కెట్ల వారికీ ఇదే సమస్య

తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు,ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు పలు రకాల దర్శన టిక్కెట్లు, టోకెన్లుతో వస్తున్న భక్తులకు పూర్తిగా గదులు ఇవ్వడం నిలుపుదలచేశారు. ఆయా భక్తులు సమయానికి కొండకు చేరుకుని వైకుంఠమ్ క్యూకాంప్లెక్స్ క్యూలైన్లలో వెళ్ళి దేవదేవుడ్ని దర్శనం చేసుకోవాలని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ (Bhudevi Complex) సముదాయాల్లో ఆఫ్ లైన్ లో జారీచేస్తున్న ఉచిత సర్వదర్శనమ్ టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు ముందుగానే తిరుమలకు చేరుకుని సిఫార్సు లేఖలపై గదులు పొందేవారు. ఇలా వస్తున్న వారి సంఖ్య పెరగడంతో గదుల కొరత తీవ్రంగా ఉంది. అంతేగాక ఈ టైమ్ స్లాట్ భక్తులు టోకెన్పై నిర్దేశించిన రోజు ఆ సమయానికి మాత్రమే కొండకు చేరుకోవాలి. టైమ్ స్లాట్ టోకెన్ భక్తులకు తిరుమలలో సిఫార్సు లేఖలపై గదులు కేటాయింపు పూర్తిగా రద్దుచేశారు. ఇక 300 ఆన్లైన్లో 300 రూపాయలు టిక్కెట్లు (మూడునెలల ముందుగానే) బుక్ చేసుకుని తిరుమలకు చేరుకునే భక్తులకు కూడా ప్రత్యేకంగా గదులు కేటాయించరు. ఈ విధానాన్ని టిటిడి పూర్తిగా రద్దుచేసింది.

తిరుగు ప్రయాణమవుతూన్నారు

సుదూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫార్సులపై గదులు ఇచ్చేందుకు వసతికల్పన విభాగం సాప్ట్వేర్ లో మార్పులు చేశారు. ఆఫ్లైన్లో రోజువారీగా 20వేల వరకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీఅవుతున్నాయి. ఆన్లైన్లో రూపాయలు టిక్కెట్లు 25వేల వరకు విడుదల చేసినా ఈ ఆన్లైన్ భక్తులు అదికంగా తమిళనాడు, కర్నాటక, తెలుగురాష్ట్రాల నుండి ఆయారోజుల్లో తిరుమలకు చేరుకుని నేరుగా ఇష్టదైవమ్ దర్శనం చేసుకుని తిరుగుప్రయాణమవుతూన్నారు. వీలైనంత వరకు దర్శన టిక్కెట్లు, టోకెన్లు కలిగిన భక్తులు తిరుపతి (Tirupati) లోనూ వసతి పొంది దర్శన సమయానికి రెండు గంటల ముందు తిరుమలకు చేరుకోవాలని టిటిడి సూచన. తిరుమలలో ప్రస్తుతం 7.200వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 2వేల వరకు గదులు,ఆన్లైన్లోనే కేటాయిస్తారు. మిగిలిన గదుల్లో సామాన్యభక్తులకు 1,500వరకు గదులు కేటాయింపు జరుగుతుంది.

Tirumala: టైమ్ స్లాట్ టోకెన్ భక్తులకు గదులు ఇవ్వరు!

గదులు కేటాయింపులో

ఇక పద్మావతి విచారణ కార్యాలయం పరిధిలో అతిదిగృహాలు. విశ్రాంతి గృహాలను రాజ్యాంగపరిధిలోని న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, బ్యూరోక్రాట్స్ అధికారులు ఇలా సిఫార్సు లేఖలపై గదులు కేటాయింపు జరుగుతుంది. ఎంబిసి ప్రాంతంలో టిటిడి ఉద్యోగులు, వారి సిఫార్సు లేఖలు, బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలకు గదులు కేటాయింపు జరుగుతుంది. ఇప్పటికే తిరుమలలో ఉన్న గదులు కేటాయింపులో సిఫార్సు లేఖల తలనొప్పులు టిటిడి (TTD) అధికారులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో ఆన్లైన్లో జారీచేస్తున్న ఎస్ఎస్ఈ టైమ్ స్లాట్ భక్తులకు పూర్తిగా గదులు కేటాయించడానికి లేదు. 10,500 రూపాయలు దర్శన టిక్కెట్ కొనుగోలుచేస్తున్న శ్రీవాణి భక్తులకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో 100రూపాయలు, వెయ్యిరూపాయలు కేటాయిస్తున్నారు.

తిరుమల యొక్క అసలు కథ ఏమిటి?

తిరుమల దేవస్థానం కథ పౌరాణికత మరియు చరిత్రకు ముడిపడినది. పౌరాణిక కథనం ప్రకారం, కలియుగంలో భూలోకంలో భక్తుల కష్టాలను తొలగించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా అవతరించి, వెంకటాద్రి కొండలపై నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది ఆయన భక్తుడు అకాశరాజుకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికై జరిగినది.

తిరుపతి బాలాజీ వద్ద జట్టు ఇచ్చే సంప్రదాయం ఎందుకు ఉంది?

తిరుపతిలో జట్టు తీయడం (తలపట్టడం) అనేది భక్తుల నమ్మకానికి అనుగుణంగా నిర్వహించే పవిత్ర సంప్రదాయం. భక్తులు తమ పాపాలు, అహంకారాన్ని వదిలిపెట్టి శ్రీవేంకటేశ్వర స్వామికి పూర్తిగా శరణాగతిని సూచించే సూచకంగా జట్టును సమర్పిస్తారు. ఈ ప్రక్రియను “టాన్షరింగ్” (Tonsuring) అని పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: AP Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక

Bhudevi complex rooms Breaking News free darshan token changes latest news Tirumala Darshan Updates Tirupati room booking changes TTD accommodation rules TTD latest news 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.