हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

AP High Court: తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

Anusha
AP High Court: తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. కానుకల లెక్కింపులో అవినీతి, చోరీలు, నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి మానవ ప్రమేయాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది.

Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పరకామణిలో సంస్కరణలను రెండు దశల్లో చేపట్టాలని హైకోర్టు నిర్దేశించింది. తక్షణ చర్యల్లో భాగంగా హుండీల సీలింగ్, రవాణా, లెక్కింపు ప్రక్రియల్లో భద్రతాపరమైన మార్పులపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇక శాశ్వత ప్రణాళికలో భాగంగా కానుకల వర్గీకరణ, విదేశీ కరెన్సీ గుర్తింపు, విలువైన లోహాలు, రాళ్లను వేరు చేయడం కోసం ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.ఇందుకోసం సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులైన నిపుణుల సహాయం తీసుకోవాలని పేర్కొంది.

Tirumala Parakamani case.. High Court instructions to TTD
Tirumala Parakamani case.. High Court instructions to TTD

తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా

ఈ శాశ్వత ప్రణాళికపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదాను కోర్టుకు సమర్పించాలని గడువు విధించింది. భక్తులు హుండీలో సమర్పించే కానుకలు వారి విశ్వాసానికి ప్రతీక అని, వాటిని కాపాడాల్సిన నైతిక, ధార్మిక బాధ్యత టీటీడీ ధర్మకర్తల మండలిపై ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ ప్రక్రియలో ఏ చిన్న లోపం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వారంలోపు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఏసీబీ డీజీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870