📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala – బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు!

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల :అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు (Salakatla Brahmotsavam) బ్రహ్మాండంగా ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. స్వామివారి వాహనసేవలను విజయవంతం చేయడం, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ మాఢవీధుల్లో, ఆలయుం ముందు, వాహనమండపం ప్రాంతాల్లో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దడం, బారీకేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు, బ్రహ్మరథం మరమ్మతులు, గొల్లమండపం వద్ద మలయప్పస్వామి చిత్రమాలిక (Malayappaswamy Chitramalika) కు రంగులు వేయడం వంటి పనులు చేస్తున్నారు.

Tirumala

ఆలయం ముందు భక్తులకు రోజువారీగా సేవలపై

ఆలయం ముందు భక్తులకు రోజువారీగా సేవలపై సమీక్షించుకునేందుకు వీలుగా టిటిడి, విజిలెన్స్, పోలీసుశాఖల శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. అన్ని విభాగాలను టిటిడి (TTD) అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ఉత్తేజపరిచి పర్యవేక్షిస్తున్నారు. 24వ తేదీ నుండి మొదలుకానున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టంగా ధ్వజారోహణం జరిగే రోజు సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) తిరుమలకు వస్తుండటం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపధ్యంలో అదనపు ఆకర్షణలుగా కటౌట్లు, సెట్టింగ్లు సిద్దమవుతున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ttd-chairman-br-naidu-better-service-should-be-provided-with-good-decisions/andhra-pradesh/545067/

Brahmotsavam arrangements Breaking News Devotee Facilities latest news Lord Venkateswara Salakatla Brahmotsavam Telugu News Temple rituals Tirumala temple Vahanaseva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.