తిరుమల: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 15వతేదీ నుండి అమలుచేయనున్న “స్త్రీ శక్తి” పథకం మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం తిరుపతి-తిరుమల, తిరుమల -తిరుపతి మధ్య ఘాట్లో తిరిగే ఆర్టీసి సప్తగిరి ఎక్స్ ప్రెస్బస్సులు, విద్యుత్ ఏసి బస్సుల్లో వర్తించదు. ఈ విషయంపై ఆర్టీసి ఎండి ద్వారకాతిరుమలరావు (RTC MD Dwarakathirumala Rao) ఒకరోజు క్రిందట స్పష్టంచేయడంతో తిరుమలకు వచ్చే మహిళ ప్రయాణీకులు ఎప్పటిలాగే టిక్కెట్ కొనుగోలుచేసి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించడం తప్పనిసరి. ప్రస్తుతం 18కిలోమీటర్లు దూరం వున్న తిరుమలఘాట్ లో నడిచే ఆర్టీసి బస్సుల్లో బస్సు ఛార్జీ ఒక్కోప్రయాణీకునికి 90రూపాయలు (ఒకవైపువ్రయాణం) వసూలుచేస్తున్నారు.
టిక్కెట్ పొందిన భక్తులు తిరుమలకు చేరుకుంటే
తిరుగుప్రయాణంలోనూ రూపాయలు టిక్కెట్ ధరగా అమల్లో ఉంది. ఎవరైనా భక్తులు రానుపోను (అప్, డౌన్) టిక్కెట్లు కొనుగోలుచేస్తే వీరికి 20 రూపాయలు ఆదా అవుతుంది. 160 రూపాయలతోనే టిక్కెట్ పొందిన భక్తులు తిరుమలకు చేరుకుంటే ఆ భక్తులు 72గంటల్లో (మూడురోజులపాటు ) తిరుమల నుండి తిరుపతి (Tirupati) కి ఏ ఆర్టీసి బస్సుల్లోనైనా ప్రయాణించే సదుపాయం ఉంది. (తిరుపతికి) 90 రూపాయలు, 12సంవత్సరాలు దాటిన పిల్లలకు 50రూపాయలు బస్సు టిక్కెట్ అమలులో ఉంది. రెండువైపులా టిక్కెట్ 100 రూపాయలు .అయితే రానుపోను టిక్కెట్ ఒకేసారి తీసుకుంటే వీరికి 10 రూపాయలు ఆదా అవుతుంది. ఇక విద్యుత్ నడుస్తున్న ఆర్టీసి ఏసి బస్సుల్లో ఒక్కో ప్రయాణీకునికి 110రూపాయలు ఛార్జీ వసూలుచేస్తున్నారు.
ఆర్టీసి బస్సుల్లోనే
తెలుగురాష్ట్రాల నుండి తిరుమలకు ప్రతిరోజూ భక్తులు పెద్దసంఖ్యలోనే వస్తున్నారు. ఇలా వస్తున్నవారిలో 30శాతంమంది మహిళ భక్తులు ఉన్నారు. దేశం నలుమూలల నుండి రోజుకు సరాసరి లక్షమందివరకు భక్తులు తిరుమలకు చేరుకుంటుండగా వీరిలో 40వేలమంది నుండి 50వేలమంది వరకు భక్తులు ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారనేది ఆర్టీసి అధికారుల సమాచారం. తిరుమల బస్సు (Tirumala Bus) ల్లో బస్సు ఛార్జీలు కూడా అధికమేననేది అనాదిగా భక్తుల నుండి వస్తున్న విమర్శలు. పైగా 2013 సంవత్సరంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, టిటిడి పాలకమండలి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా తిరుమల ఘాట్లో భక్తులకు బస్సు ఛార్జీలు తగ్గిస్తామని భరోసానిచ్చారు.
ఎన్నికల హామీల్లో భాగంగా
అయితే ఆయన హామీ నెరవేరేలోపు ప్రభుత్వం మార్పుజరిగింది. 2019లో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఈ పెరిగిన ఛార్జీలు తిరుమల ఘాట్లో ప్రయాణీకులకు వర్తించింది. ప్రస్తుతం 90రూపాయలు తిరుమలకు బస్సు టిక్కెట్ వసూలుచేస్తున్నారు. తిరుమలకు 450వరకు వివిధ డిపోలకు చెందిన ఆర్టీసి సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సులు ప్రతిరోజూ నడుస్తున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా 15నెలల క్రిందట అప్పటి తెలుగుదేశం పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చేందుకు ఆగస్ట్ 15 శుభముహూర్తంగా నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా మహిళలు ఆధార్ కార్డు, ఓటరుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంతో ఉచితంగా ఆర్టీసి నడుపుతున్న పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించేలా చూస్తారు.
తిరుమల పర్వతాలను ఏమని పిలుస్తారు?
తిరుమల పర్వతాలను శేషాచలం పర్వతాలు అని పిలుస్తారు.
తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలు ఏమిటి?
తిరుమలకు రోడ్డు మార్గం, పాదయాత్ర మార్గం (అలిపిరి, శ్రీనివాసమంగళం) ద్వారా చేరవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :