📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala – తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి పదిరోజుల్లో ఆరంభంకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న సామాన్యభక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లుచేస్తున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. ఇప్పటికే తిరుమలలో ఆలయ మాఢవీధుల్లో ఏర్పాట్లు దాదాపు పూర్తికావస్తున్నాయన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల,వీక్షణకు భక్తులకు తిరుమలఅంతటా 35 ఎన్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుపై ఆదివారం సాయంత్రం టిటిడి (TTD) ఇఒ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ మామిళ్ళ వెంకయ్యచౌదరి, సివిఎసీ, మురళీకృష్ణ, సిఇ సత్యనారాయణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి చైర్మన్ బిఆర్నాయుడు మాఢవీధుల్లో తనిఖీ చేశారు. పదిరోజుల్లో మొదలుకానున్న స్వామివారి వాహనసేవల వీక్షణకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మాఢవీధుల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు, అందులో ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Tirumala

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా

గరుడసేవ (Garuda Seva) రోజు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రత, సౌకార్యలు ఏర్పాటుచేస్తామన్నారు. వైద్యసేవలు, మరుగుదొడ్లు, తాగునీరు. అన్నప్రసాదాలు, కాపీ, పాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆలయ మాఢవీధుల్లో, ఆలయుం ముందు, వాహనమండపం ప్రాంతాల్లో గ్యాలరీ (Gallery’s) లు ఏర్పాటు పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. వాహనసేవలు జరిగే సమయంలో భక్తులు గ్యాలరీల్లోకి సులభంగా చేరుకునేలా, తిరిగి వెలుపలకు వెళ్ళేలా భద్రత సిబ్బంది చర్యలు తీసుకుంటారన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/red-sandalwood-smuggling-rajampet-to-punganur-red-sandalwood-smuggling/andhra-pradesh/547594/

annual Brahmotsavam Breaking News devotees arrangements latest news madhaveedhi preparations Telugu News tirumala TTD Chairman BR Naidu vehicle services Venkateswara Swamy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.