తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు స్వామివారి సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం అవుతుందని టీటీడీ(Tirumala) అధికారులు వెల్లడించారు.గత 24 గంటల్లో మొత్తం 71,208 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,135 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలావుంటే, భక్తులు కానుకగా సమర్పించిన నిధులతో హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లుగా నమోదైంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: