తిరుమల : తిరుమలేశుని( Tirumala) ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి తొలిమూడురోజులకు ఇ డిప్ ద్వారా 1.76లక్షల టోకన్లు టిటిడి జారీచేసింది. ఈ టోకన్లు అందుకున్న భక్తులదే అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ఏడాది పది రోజుల వైకుంఠద్వార దర్శనాల్లో తొలిమూడు రోజులు డిసెంబర్ 30,31, జనవరి 1కి గాను ఆన్లైన్ ఇ డిప్ ద్వారా టోకన్లు జారీకి ముందస్తుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించింది. ఇందులో టిటిడి వెబ్సైట్, ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా తొలిమూడురోజులకు 24లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1.76లక్షలు టోకన్ల జారీకి 30వతేదీకి వైకుంఠ ఏకాదశికి 8,71,340మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇ డిప్ ద్వారా 57 వేలమందికి, మూడవ రోజూ దర్శనాలకు 8,52,404మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64వేలమందికి, జనవరి 1కి 8,48,367ລ້ పేర్లునమోదుచేసుకోగా 55వేలమందికి కేటాయించారు.
Read Also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

ఆ మూడు రోజులు( Tirumala) అన్ని దర్శనాలు రద్దుచేశారు. జనవరి 2నుండి 8వతేదీ వరకు 300 రూపాయలు దర్శనాలు రోజుకు 15వేలు, శ్రీవాణి వెయ్యి టిక్కెట్లు విడుదల చేస్తారు. 2నుండి 8వతేదీ వరకు సామాన్యభక్తులకు సర్వద ర్శనంలో టోకెన్లు లేకున్నా వైకుం ఠమ్ 2నుండి అనుమతినిస్తారు. స్థానికులకు జనవరి 6,,7,8 తేదీలకు రోజులకు ఐదువేల టోకన్లు ఆన్లైన్లో డిసెంబర్ 10వతేదీ విడుదల చేయనున్నారు. వైకుంఠ ఏకాదశిన 30వతేదీ ప్రోటోకాల్ ప్రముఖులతో బాటు టోకన్లు అందుకున్న భక్తులకు కలిపి 70వేలమంది వరకు దర్శనం చేయించాలని కార్యాచరణ రూపొందించారు. కాగా ఆన్లైన్లో ఇ డిప్లో టోకన్లు జారీకూడా మతలబేనని సామాన్య భక్తులు నిరుత్సాహం చెందుతు న్నారు. గతంలో జరిగిన ఘటనలతో టిటిడి ఆన్లైన్లో టోకన్లు జారీచేసి చాలావరకు సామాన్యభక్తులకు వైకుంఠద్వారం దూరం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: