📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Telangana : గర్భగుడిలో రహస్య నిధుల కోసం దాడి

Author Icon By Divya Vani M
Updated: March 31, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : గర్భగుడిలో రహస్య నిధుల కోసం దాడి తెలుగు రాష్ట్రాల్లో గుప్త నిధుల వేట మళ్లీ జోరందుకుంది ఏదైనా పురాతన ఆలయం కనిపిస్తే చాలు రహస్యంగా తవ్వకాలు మొదలవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ ఆలయాన్ని టార్గెట్‌ చేసిన సంఘటన కలకలం రేపింది. కంభాలపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రిల్లింగ్ మిషన్‌తో గర్భగుడికి రంధ్రాలు చేసేశారు.శనివారం రాత్రి ఆలయ అర్చకులు పూజలు ముగించాక గుడికి తాళం వేశారు. అర్చకుడు ఆదివారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి చూడగా గర్భగుడిలో కుదుర్లు కనిపించాయి. డ్రిల్లింగ్ మిషన్‌తో గోడకు రంధ్రాలు చేసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రత్యేక శక్తి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆలయంలో గతంలోనూ దొంగతనాలు జరిగాయట. కానీ ఈసారి నేరస్తులు నేరుగా గర్భగుడికే చేరుకోవడం భక్తులను కలవరపాటుకు గురిచేసింది.

Telangana గర్భగుడిలో రహస్య నిధుల కోసం దాడి

ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని గ్రామస్థులు అంటున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయాలపై దాడులు చేయడం తీవ్ర పాపమని, గుప్త నిధుల కోసం ఇలాంటి పనులు చేయడం వలన దుష్ఫలితాలు తప్పవని వారిని హెచ్చరిస్తున్నారు.పురాతన ఆలయాలు, గుప్త నిధుల కథనాలు ఇప్పటికీ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ, వీటిని నమ్మి అక్రమ తవ్వకాలకు పాల్పడటం నేరమే కాదు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా తప్పేనన్నది భక్తుల వాదన. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు.

AncientTemples CrimeNews HiddenTreasure KakatiyaDynasty Mahabubabad TelanganaNews TempleMystery TreasureHunt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.