📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఈ నెల 15 నుంచి తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు

Author Icon By Sharanya
Updated: May 6, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు భక్తులకోసం పండుగ వాతావరణాన్ని తలపించనున్నాయి. పుష్కరాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలు, భక్తుల సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్లు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాంతంలో ప్రధానంగా జరగనున్న ఈ పుష్కరాల్లో దాదాపు లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

భక్తులకు ఆతిథ్యంతో కూడిన అనుభవం

పుష్కరాల వేళ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మంత్రులు శ్రీధర్ బాబు సురేఖ పుష్కరాల పై సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జరగబోయే సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్‌ ప్రయాణం అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టూ ఉన్న పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జాయ్‌రైడ్‌’ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఒకేసారి 6 గురు ప్రయాణించేందుకు వీలుగా ఎయిర్‌బస్‌ హెచ్‌-125 మోడల్‌ హెలికాప్టర్‌ను వినియోగించనుంది.

హెలికాప్టర్ జాయ్ రైడ్

జాయ్ రైడ్ జాయ్ రైడ్ టికెట్‌ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేయగా ప్రయాణ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు. హెలికాప్టర్‌ ప్రయాణాలకు అవసరమైన సాంకేతిక అనుమతు , ఇతరత్రా వ్యవహారాలు మొత్తం ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకే జాయ్‌రైడ్‌లను నిర్వహించనున్నారు. కాగా, ఈ హెలికాప్టర్‌ ప్రయాణాల బాధ్యతలను బెంగళూరు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. జాయ్‌రైడ్‌లకు అవసరమైన సాంకేతిక అనుమతులను సదరు సంస్థే ఏర్పాటు చేసుకుంటుంది. పుష్కర ఘాట్‌లకు దగ్గర్లోనే హెలికాప్టర్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, పర్యాటకశాఖలతో పాటు సివిల్‌ ఏవియేషన్‌ విభాగం సంయుక్తంగా హెలికాప్టర్‌ ప్రయాణాలను పర్యవేక్షించనున్నాయి.

భక్తులకు ప్రభుత్వ ప్రత్యేక భరోసా

పుష్కరాల సందర్బంగా హెలికాప్టర్ రైడ్, టెంట్ సిటీ వంటి సదుపాయాలు గతంలో మేడారం జాతరలో విజయవంతంగా అమలైన అనుభవాల ఆధారంగా తీసుకురాబడ్డాయి. ఈ చర్యలు ప్రజలలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అప్పుడు భక్తుల నుంచి మంచి ఆదరణ రావడంతో సరస్వతి పుష్కరాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, బెంగళూరు నుంచి కాళేశ్వరానికి మళ్లీ ఇక్కడి నుంచి అక్కడకు హెలికాప్టర్‌ ఖాళీగా వచ్చి, వెళ్లాల్సిన నేపథ్యంలో రూ.20 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా హెలిప్యాడ్‌కు దగ్గర్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలను అందుబాటులో ఉంచనుంది. ఇక పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

Read also: Bandi Sanjay: రేవంత్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

#Kaleswaram #Pushkaralu #SaraswatiPushkaralu2025 #SaraswatiRiver #SpiritualTelangana #TelanganaPushkaralu Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.