విజయవాడ : ఆలయాల అభివృద్ధి వలన ఆయా ప్రదేశాలు, పర్యాటకరంగంలోను(tourism) అద్భుతరీతిలో వృద్ధి సాధించవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అటవీప్రాంతాల సంరక్షణ విషయంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు. ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ, అటవీశాఖ అధికారులకు మార్గదర్శనం చేసారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారు.
Read Also: AndhraPradesh:గురుకులంలో కామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థులు మృతి
ఈ సమీక్ష సమావేశంలో వర్చువల్గానే డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సిఎం చంద్రబాబు మాట్లాడారు. సిఎంతో పాటు సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాదాయ శాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజర య్యారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధిపై సీఎం చర్చించారు.
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
దేవాలయ అభి వృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవా దాయశాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16 తేదీన ప్రధాని మోడీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సిఎం సూచించారు. డోర్నాల, నుండి పెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి కనెక్టు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సిఎం. పేర్కొన్నారు.
దీనిపై డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరిం చాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సిఎం ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని అన్నారు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించలేమని.. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి ఆటవీ మంత్రిత్వశాఖకు ఈ అంశాలను వివరించాలని సూచించారు.
ఆయా ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆటవీ ప్రాంతాలను కూడా రాష్ట్రప్రభుత్వం సంరక్షిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పచ్చదనం పెంపు., అటవీ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో. పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సిఎం ఆటవీశాఖ అధికారులను ఆదేశించారు. శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి నూతన ప్రతిపాదనలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు.
ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ శ్రీశైలం దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల మల్లన్న ఆలయానికి దాదాపు రూ.1.657 కోట్ల ఆర్ధిక సహాయం. చేయాలని సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానిని కోరనున్నారు. కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాశ్ కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ను అభివృద్ధి చేయడానికి సదరు నిధులు వినియోగించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. అందుకుగాను రూ.90 కోట్లతో నూతన క్యూకాంప్లెక్స్, రూ.65 కోట్లతో గంగాధర మండవం నుంచి నందిమండవం వరకు మండపాల నిర్మాణం, రూ.25 కోట్లతో కైలాస మానస సరోవరం ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, రూ.25 కోట్లతో కైలాస కళాక్షేతం, రూ.13 కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోటు నిర్మాణం, రూ.10 కోట్లతో సామూహిక అభిషేక మండవ నిర్మాణం, రూ.5 కోట్లతో దేవస్థానం వర్క్షాప్ నుంచి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం, రూ.95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధి పనులు చేయాలని ఇది. ఎం. శ్రీనివాసరావు ఇప్పటికే దేవాదాయశాఖ అనుమతి కోరారు.
శ్రీశైలం దేవస్థానం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోనే ఉండడంతో అభివృద్ధి పనులను(Development work) చేయాలంటే తరచూ అటవీశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో శ్రీశైల దేవస్థానం భూమి సమస్యను సైతం ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అటవీశాఖ ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తకుండా 5.362 ఎకరాల భూమిని దేవస్థానానికి చెందే విధంగా సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించనున్నారు తెలంగాణ పరిధిలో అమ్రాబాద్ నుంచి బ్రహ్మగిరి(దోమ పెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అదే విధంగా కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులు ఆత్మకూరు-దోర్నాల మధ్యనున్న ఇరుకైన రహదారి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆత్మకూరు దోర్నాల మధ్య నల్లమల అడవులు ఉండడంతో జాతీయ రహదారి నిర్మాణం
ఊసే లేకుండా పోయింది. అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉండడంతో ఘాట్ రోడ్డు విస్తరణ పనులు చేయడం సమస్యగా మారింది. తెలంగాణ ప్రాంతం తరహాలో ఇక్కడ కూడా ఎలివేటెట్ కారిడార్ను నిర్మిస్తే ప్రయాణాలకు అసౌకర్యాలన్నీ తొలగిపోతాయని ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులంతా అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: