శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, భక్తుల సౌలభ్యం, నిర్వహణ సజావుగా ఉండేందుకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జలాశయానికి గేట్లు తెరవడం, ఆలయానికి చేరువగా నీటి మట్టం పెరగడం వల్ల భక్తుల రాకపోకలు పెరిగినందున, ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం ప్రకారం జూలై 15 (మంగళవారం) నుంచి 19 వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 గంటల మధ్య కల్పించే ఉచిత స్పర్శ దర్శనం ( Free Sparsha Darshan) అందుబాటులో ఉండదు. ఈ సమయంలో స్పర్శ దర్శనానికి క్యూలైన్లో నిలిచే భక్తులకు కేవలం అలంకార దర్శనమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
స్పర్శ దర్శనం ఎందుకు నిలిపివేశారు?
శ్రీశైలంలో (Srisailam) జలాశయం ఇటీవల పూర్తిగా నిండి ఉండడం వల్ల, పర్యాటకుల సంఖ్యతో పాటు భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వారాంతంలో వచ్చిన భారీ రద్దీ వల్ల ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, క్యూ లైన్లలో ఇబ్బందులు, వేదికల వద్ద గుంపులు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో భక్తులకు అవాంఛనీయమైన ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మరియు నిర్వహణ సజావుగా కొనసాగేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
భక్తులకు విజ్ఞప్తి
ఈ సందర్భంగా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందుగానే ఈ విషయాన్ని గుర్తించాలంటూ దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఇదిలా ఉండగా పరిస్థితికి అనుగుణంగా తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరారు .
Read also hindi.vaartha.com
Read also Floor Painting : కృష్ణమ్మ తీరంలో కుంచెతో కోటి భావాలు