📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Srikalahasti Temple: శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

Author Icon By Rajitha
Updated: March 13, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మూతపడిన ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరుని ప్రసాదాల తయారికి గ్యాస్ కొరత ‘గుదిబండగా మారింది. వారం రోజులుగా పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గురువారానికి శ్రీకాళ హస్తీశ్వరాలయంలో భక్తులకు అందించే లడ్డు, వడ, జిలేజీల తయారికి గ్యాస్ కొరత శాపంగా మారింది. అయితే నిత్యాన్న ప్రసాదం, స్వామి అమ్మవార్ల నైవేద్యం అతి కష్టం మీద తయారు చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో పుణ్యక్షేత్రంలోని పెద్ద హోటళ్ళ తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. దాంతో వ్యాపారాలు కుదేలయ్యాయి.

Read also: TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

Srikalahasti Temple: ‘Gas Heat’ for Preparing Lord Shiva’s Offerings

గ్యాస్ వాడకం ఇలా.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో

రోజుకు ప్రసాదాల తయారికి 22 సిలిండర్లను వాడుతున్నారు. ఇతరత్రా ప్రసాదాలతో పాటు నిత్యాన్నదాన పథకానికి మరో పది సిలిండర్లను వాడుతున్నారు. వారం రోజులుగా గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయటం లేదు. దాంతో వారం పాటు పోటు అధికారి హరియాదవ్ పొదుపుగా వాడారు. గురువారం నాటికి ఖాళీ అయ్యింది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో ఇఓ చర్చలు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి ఆలయ కార్యనిర్వహణాధికారి బికె వెంకటేశు గ్యాస్ కెంపనీల ప్రతినిధులతో చర్చించారు. అయితే ప్రయోజనం లేదు. దాంతో ప్రత్యామ్నాయంగా కట్టెపొయ్యలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

రాబోయే మూడు రోజులు భక్తులు విశేషంగా వస్తారు. అంతేకాక ఈ నెల 19 ఉగాది ఉంది. కాబట్టి భక్తుల తాకిడి. అధికంగా ఉంటుంది. ఎలా చేయాలి? అనే సందిగ్ధంలో సతమతమౌతున్నారు. ఇక పట్టణంలోని ఆలయం చుట్టు ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పెద్ద హోటళ్ళు మూత పడ్డాయి. గ్యాస్ కెంపెనీలు అందించిన సమాచారం మేరకు శ్రీకాళహస్తిలో 4 గ్యాస్ కంపెనీలున్నాయి. వీటి ద్వారా వంట సిలిండర్లు 40వేలు, కమర్షియల్ కనెక్షన్లు సుమారు 200కు పైగా ఉన్నాయి. అయితే ఇళ్ళ వాడకానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వ నిబంధనల మేరకు అందిస్తున్నామని కానీ కమర్షియల్ సిలిండర్లు రావటం లేదన్నారు. దాంతోకొరత ఏర్పడిందని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Commercial gas Gas crisis latest news Pilgrimage Issues. Shiva Prasadam Srikalahasti Temple Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.