ఇంటింటా పసుపు నీళ్ళు సమర్పణ
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో(Srikalahasti) నిర్వహించే ఏడు గంగమ్మల జాతరకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా సారె బహూకరణ నిర్వహించారు. శాసనసభ్యుడు బొజ్జల సుధీర్రెడ్డి దంపతులు, రాష్ట్ర బిజెపి(BJP) ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్కుమార్ ఆయన సతీమణి కోలా విశాలాక్షి, చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ దంపతులు, ఇఓ డి.బాపిరెడ్డి హాజరు కాగా ఏర్పాట్లను ఆలయాధికారులు పర్యవేక్షించారు. ఆలయ ప్రధానార్చకులు సంబంధం, కరుణాకర్ గురుకుల్స్ పూజలు నిర్వహించారు.
Read also: ₹40 వేల కోట్లతో ‘పూర్వోదయ’ ప్రాజెక్టులు: AP అభివృద్ధికి CBN భారీ ప్లాన్
వేద మంత్రోచ్చారణల మధ్య గంగమ్మలకు సారె సమర్పణ ఘనంగా
ఆలయ పౌరోహితులు అర్థగిరి స్వామి వేద మంత్రాలు పఠిస్తుండగా శాస్త్రోక్తంగా సారె ఊరేగింపు ప్రారంభించారు. శివయ్య గోపురం(Srikalahasti) నుంచి రాజగోపురం ద్వారా తేరువీధిలోకి ప్రవేశించింది. సారె తీసుకెళుతున్న అతిధుల కాళ్ళకు ఇంటింటా భక్తులు పసుపు నీళ్ళను సమ ర్పించారు. ఓ వైపు భక్తులు మొక్కులు తీర్చుకుంటుండగా భక్తి శ్రద్ధలతో అతిధులు సారెను ఆయా గంగమ్మలను సమర్పించు కుంటూ ముత్యాలమ్మగుడి వీధిలోని ఏడు గంగమ్మలు నిల్చు స్థలంలో సారెను సమ ర్పించారు. అక్కడ అతిధితులకు కాసరం రమేష్ సారధ్యంలో స్వాగతం పలికారు. సారెకు ముందు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డిఎస్పీ నరసింహామూర్తి, సిఐ ప్రకాష్ కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. బోర్డు సభ్యులు వాకచర్ల గుర్రప్పశెట్టి, దండి రాఘవయ్య, పగడాల మురళి, కౌసల్య పాల్గొన్నారు. ఆలయాధికారులు ఇఓ డి. బాపిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శ నం, పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్ తదితరులు పర్యవేక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: