📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sri Kamalananda Bharati: ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

Author Icon By Saritha
Updated: December 31, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకమలానంద భారతి స్వామీజీ

ఐరాల : ప్రతి హిందువు (Sri Kamalananda Bharati) ప్రతి రోజూ గుడికి వెళ్ళడం అలవర్చుకోవాలని గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీకమలానంద భారతి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ హిందూ అంటేనే నాగరికత అని తెలిపారు. హిందువులు భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారని, హిందూత్వం ప్రకృతితో ముడిపడి వుందన్నారు. చెట్టు, పుట్ట, జంతువులను పూజించే గుణం హిందువుల్లో వుందన్నారు. భూమిపై వున్న సమస్త జీవరాశులు దేవుని ప్రతిరూపాలని స్వామీజీ అన్నారు.

Read also: Vaikunta Ekadashi: కాణిపాకంలో విఐపిల రద్దీ

భక్తులకు ముఖ్య సందేశాలు

ఈ కారణంగా హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని అన్నారు. ప్రతి హిందువు ప్రతి రోజూ గుడికి వెళ్ళడం అలవర్చుకోవాలని సపూచించారు. (Sri Kamalananda Bharati) మన గుడికి వెళ్లడానికి నాయకుల సిపార్స్లు ఎందుకని, అక్కడే మన సామర్థ్యం తేటతెల్లమవుతోందన్నారు. తిరుమలకు (Tirumala) వెళ్లే భక్తులు ఒక్కరోజులో స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేయాలన్న ఆలోచన మానుకుని ఎన్ని రోజులైనా వేచివుండి స్వామివారిని దర్శించుకుని ఇంటికి రావాలన్నారు. అలాగే హిందూత్వం గురించి పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుండి తెలియజేయాల్సిన అవసరం వుందన్నారు. హిందువులపై ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు మన రాష్ట్రంలో ప్రారంభం కాకముందే హిందువులందరూ మేల్కొనాలని స్వామీజీ సూచించారు. ఈకార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సీతాపతినాయుడు, విభాగ్ సహకార్యవాహ రెడ్డెప్పలతో పాటు అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


Daily Temple Visits Hindu Sammelan Hindu Unity Hinduism Latest News in Telugu Sri Kamalananda Bharati Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.