Spiritual Signs: కలలో దేవతలు దర్శనమిస్తే అర్థం ఇదే!

Read Time:  1 min
Spiritual Signs
Spiritual Signs
FONT SIZE
GET APP

స్వప్నశాస్త్రం (Spiritual Signs)ప్రకారం కలలో దేవతలు కనిపించడం ఆధ్యాత్మికంగా ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు. అయితే దేవతలు ఎలా, ఏ పరిస్థితిలో కనిపిస్తారన్నదానిపై ఫలితాలు మారుతాయని నిపుణులు చెబుతున్నారు. కలలో దేవతలు ఆలయంలో దర్శనమిస్తే, మనసులో శాంతి నెలకొని కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయని సూచన. దేవతలకు పూజ చేస్తున్నట్లు కనిపిస్తే, మీరు చేసే కృషికి మంచి ఫలితాలు వస్తాయని, ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయని అర్థం.

Read Also: Astrology: గ్రహాల ప్రకారం సాంప్రదాయ పిండి పదార్థాలు

Spiritual Signs

దేవతలు ప్రసాదం ఇస్తున్నట్లు కల వస్తే, అనుకోని అదృష్టం, శుభకార్యాల ఆహ్వానం లేదా ముఖ్యమైన శుభవార్త వినే అవకాశం ఉందని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే దేవతలతో మాట్లాడుతున్నట్లు కల వస్తే, మీకు సరైన మార్గదర్శనం లభిస్తుందని, నిర్ణయాల్లో స్పష్టత వస్తుందని భావిస్తారు.

అయితే దేవతలు ముఖం తిప్పడం, మౌనంగా(Spiritual Signs) ఉండటం లేదా దూరంగా వెళ్లిపోతున్నట్లు కలలో కనిపిస్తే, మన జీవితంలో ఆధ్యాత్మిక నిర్లక్ష్యం పెరిగిందన్న సంకేతంగా భావించాలి. అలాంటి సందర్భాల్లో దైవస్మరణ, సేవా కార్యక్రమాలు, మొక్కులు నెరవేర్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

https://vaartha.com/devotional/ttd-14/638419/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.