తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది ఆలయాలైన అయోధ్య(Ayodhya) రామమందిరం, వారణాసిలోని కాశీ (kasi)విశ్వనాథుని దర్శనానికి వచ్చే భక్తులకు కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ (Yogi Adiyanath)దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman)ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది ఆలయాల సందర్శనకు ఏటా లక్షలాదిగా భక్తులు తరలివెళ్తుంటారు. అక్కడ సరైన వసతులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య రామమందిరం, వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే తెలుగు భక్తుల ఇబ్బందులను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దృష్టికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని ముఖ్యమంత్రి యోగికి వినతి పత్రం అందజేశారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ లక్ష్మణ్, ఈ విషయాన్ని దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగు భక్తుల కోసం ప్రత్యేక వసతి, భోజనం, పార్కింగ్, విశ్రాంతి గృహాలు వంటి సదుపాయాల కోసం 200 గజాల నుంచి 1 ఎకరం వరకు భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
నిర్మాణాలకు ఎకరం వరకు భూమి
కాశీ, అయోధ్య వెళ్లే భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజనం, పార్కింగ్, గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందని సీఎంకు లక్ష్మణ్ వివరించారు. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం కాశీ, అయోధ్యలో వసతి, భోజన, పార్కింగ్, గృహాల వంటి నిర్మాణాలకి అవసరమైన, కనీసం 200 చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు భూమి కేటాయించాలని కోరారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల కోసం తన సొంత ఎంపీ ల్యాడ్స్ నిధులు లేదా ఇతర సంబంధిత నిధుల సాయంతో నిర్మాణాలు చేపడతానని లక్ష్మణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల(south states) నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
యూపీ రాజధాని లక్నోలో సీఎం యోగిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా సౌకర్యాలు కల్పిస్తామని లక్ష్మణ్ అన్నారు.అవసరమైన భూమిని కేటాయించిన తర్వాత, ఎంపీ లక్ష్మణ్ తన MP LAD నిధులు లేదా ఇతర సంబంధిత నిధుల ద్వారా నిర్మాణాలు చేపడతానని స్పష్టం చేశారు. ఈ నిర్మాణాలు భక్తుల యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తాయని తెలిపారు. ఈ చర్యలు అమలైతే, దూర ప్రాంతాల నుంచి రాబోయే భక్తులకు ఉత్తమ యాత్రానుభవం లభించడమే కాకుండా, ఉత్తరాది పుణ్యక్షేత్రాలు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
Read Also : Amarnath: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం