శివరాత్రి(Shivaratri 2026) సందర్భంగా భక్తులు కఠిన ఉపవాసం పాటించడం సంప్రదాయం. అయితే దీర్ఘకాలం ఉపవాసం చేసిన తర్వాత శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం ముగిసిన వెంటనే భారీగా భోజనం చేయకుండా, చిన్న పరిమాణంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మెత్తగా వండిన అన్నం, పప్పు, ఉడికించిన కూరగాయలు, చిలగడదుంప, ఇడ్లీ, పెరుగన్నం వంటి సాత్విక ఆహారం శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది.
Read Also:Andhra Pradesh: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు
అలాగే తగినంత నీరు లేదా మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుకోవచ్చు. పండ్లు, సూప్‌లు కూడా జీర్ణక్రియకు(Shivaratri 2026) సహాయపడతాయి. కాని నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, అధిక ఉప్పు లేదా కారంతో తయారైన ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్‌లను తినకుండా ఉండాలి. ఇవి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. వైద్యుల సూచనల ప్రకారం ఉపవాసం తర్వాత మొదటి భోజనం తేలికగా తీసుకుని, కొంతసేపటి తర్వాత సాధారణ భోజనానికి మారడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: