మకర సంక్రాంతి(Sankranti) దేశవ్యాప్తంగా పంట కోత పండుగగా విశేష ప్రాధాన్యం పొందింది. ఈ పర్వదినానికి నువ్వులతో విడదీయరాని అనుబంధం ఉండటంతోనే దీనిని ‘తిల్ సంక్రాంతి’ అని కూడా వ్యవహరిస్తారు. సంక్రాంతి సందర్భంగా నువ్వులతో చేసిన వంటకాలు, దానధర్మాలు ప్రత్యేకంగా నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
Read Also: Bhogi Festival: మంటలు వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?
నువ్వులతో ముడిపడిన సంప్రదాయం, పురాణాల కథనాలు
పురాణాల ప్రకారం నువ్వులు అత్యంత పవిత్రమైనవిగా భావించబడుతాయి. యమధర్మరాజు ఆశీర్వాదంతో ఇవి ‘అమరత్వానికి ప్రతీక అయిన గింజలు’గా పేరుపొందాయని విశ్వాసం ఉంది. అలాగే హిరణ్యకశిపుడి దౌర్జన్యకాలంలో విష్ణుమూర్తి శ్రమతో జారిన చెమట బిందువుల నుంచి నువ్వులు పుట్టాయని ఒక కథనం ఉంది. మరోవైపు సముద్ర (Sankranti)మథనం సమయంలోనూ నువ్వులు ఉద్భవించాయని పురాణ గాథలు పేర్కొంటున్నాయి. ఈ విధంగా వ్యవసాయ ఆనందం, ఆధ్యాత్మిక విశ్వాసం రెండింటినీ ఏకంగా మేళవించిన పండుగగా మకర సంక్రాంతి నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: