📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: Sabarimala: శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

Author Icon By Tejaswini Y
Updated: December 2, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభంలోనే రికార్డు ఆదాయం నమోదైంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు 15 రోజుల్లో ఆలయానికి రూ. 92 కోట్లు లభించాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 33.33% అధికం.

Read Also: Shabarimala: 18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

Record income in Sabarimala – Rs. 92 crores in 15 days

ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అయ్యప్ప ప్రసాదం విక్రయాలు పెరగడం. ప్రసాదం అమ్మకాల వల్లే రూ. 47 కోట్లు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ప్రసాదం ఆదాయం 46.86% పెరిగింది. హుండీ ఆదాయం కూడా 18% పెరిగింది.

భక్తులు శబరిమలను దర్శించడంతో ఆదాయం

ఈ కాలంలో 13 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించడంతో ఆదాయం(Income) పెరిగిందని టీడీబీ తెలిపింది. పెరుగుతున్న రద్దీ కారణంగా మలికప్పురం ఆలయం వెనుక హాల్లో ప్రతిరోజు 10,000 మందికి పైగా భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తున్నారు.

వేడుకలు ఇంకా కొనసాగుతున్నందున ఈ సీజన్ చివరికల్లా ఆదాయం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని దేవస్థానం భావిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.