దక్షిణ గోవాలోని కనకోనా జిల్లా పార్టగల్ గ్రామంలో ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠాన్ని ఇవాళ ప్రధాని మోదీ (PM Modi) సందర్శించారు. ఈ మఠం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 77 అడుగుల ఎత్తు కలిగిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం.. భారతదేశంలోని అత్యంత పురాతన మఠాల్లో ఒకటి కావడం విశేషం. 370 సంవత్సరాల క్రితం పార్టగల్‌లో ఈ మఠాన్ని నిర్మించారు. ఈ మఠం 550 ఏళ్ల సంప్రదాయాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Read Also: Holidays table: 2026 సెలవుల జాబితా విడుదల
నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కార్యక్రమాలు
గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. 550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ 7,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గోవా పర్యటనకు ముందు, ప్రధాని మోదీ (PM Modi) కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించారు. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన ‘లక్ష కంఠ గీతా పారాయణం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష మంది విద్యార్థులు, పండితులు, సన్యాసులు, సాధారణ పౌరులతో కలిసి భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గర్భగుడి ఎదుట నిర్మించిన సువర్ణ తీర్థ మంటపాన్ని ప్రారంభించారు. అలాగే, కనకదాసు శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవిత్ర కిటికీ ‘కనకన కిండి’కి బంగారు కవచాన్ని (కనక కవచం) సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: