సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi).. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నారు. గతంలో సత్యసాయి బాబాను కలిసిన దృశ్యాలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ (PM Modi) ఒక సందేశాన్ని ఇచ్చారు.
Read Also: Puttaparthi: పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సచిన్, ఐశ్వర్యరాయ్
నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి.
ఆయనతో సంభాషించడానికి, ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అని మోదీ పేర్కొన్నారు.
బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు
సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని, తపాల బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు.
బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: