ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి (Puttaparthi) శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు.
Read Also: Karumuri Venkata Reddy : వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి కి బెయిల్
ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి
(Puttaparthi) శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ (Prime Minister Modi) పుట్టపర్తికి వచ్చారు. శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల నాణెం, స్టాంప్ విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ.. పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రధాని సత్యసాయి బాబా మహాసమాధికి చేరుకున్నారు. అక్కడ సత్యసాయిబాబాకు నివాళులర్పిస్తారు. తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా జీవితం, బోధలను స్మరిస్తూ మోదీ ప్రసంగిస్తారు. అలాగే బాబా స్మారకార్థం ప్రత్యేక నాణెం, స్టాంప్ విడుదల చేస్తారు.. త్వరలోనే ఈ నాణేలు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా విక్రయిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: