Parabhava Samvatsaram: సాధారణంగా ‘పరాభవ’ అంటే అవమానం లేదా పరాజయం అని అర్థం వస్తుంది. అయితే, ఈ సంవత్సరం మొత్తం ప్రతికూల ఫలితాలు ఉంటాయని భావించకూడదు. ఆధ్యాత్మిక కోణంలో పరాభవ అంటే షడ్గుణాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించడం అని అర్థం. ఎవరైతే తమలోని దుర్గుణాలను అదుపులో ఉంచుకుని, ధర్మబద్ధంగా కష్టపడతారో, వారికి ఈ ఏడాది అద్భుతమైన విజయాలు లభిస్తాయని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
Read Also: Ugadi 2026: ‘పరాభవ’ నామ సంవత్సర విశిష్టత
ఆధ్యాత్మిక నిఘంటువు ప్రకారం ‘పరాభవ’ అనే పదానికి లోతైన అంతరార్థాలు ఉన్నాయి. ఇందులో ‘పరా’ అంటే అమ్మవారు అని, ‘భవ’ అంటే శివుడు లేదా ఆవిర్భావం అని అర్థం. వెరసి పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వానికి ఇది ప్రతీక. అమ్మవారికి అత్యంత సమీపంలో ఉండటమే ఈ సంవత్సర విశిష్టత అని, భక్తిశ్రద్ధలతో ఉండేవారికి దైవబలం తోడవుతుందని పండితులు పేర్కొంటున్నారు. కేవలం పేరును బట్టి భయపడకుండా, అంతరార్థాన్ని గ్రహించి ముందుకు సాగాలని వారు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: