📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: Indrakeeladri: 4న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నేటి నుండి శ్రీహనుమత్ వ్రతం

Author Icon By Tejaswini Y
Updated: December 1, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి(Indrakeeladri) గిరి ప్రదక్షణ డిసెంబర్ 4న జరుగుతుందని ఇఓ వికె శీనానాయక్ తెలిపారు. ఉదయం 5:55 లకు శ్రీ కామథేను మాత ఆలయం వద్ద ప్రారంభమై కుమ్మరిపాలెం, పాల ఫ్యాక్టరీ, బ్రాహ్మణ వీధుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుందన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(Durga Malleshwara Swamy Temple) అనుబంధ ఆలయమైన సీతానగరంలోని శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివార్ల దేవస్థానంలో 1నుండి 3వ తేదీ వరకు శ్రీ హనుమత్ వ్రతం నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్(VK Sheena Nayak) తెలిపారు. 3న హనుమత్ హోమం లక్ష నాగవల్లీ దళార్చన నిర్వహించి సాయంత్రం హనుమతవ్రతం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ నిర్వహి స్తామన్నారు. రు.1116ల ఉభయంతో ఉభయ దాతలు పాల్గొనాలన్నారు.

Read Also: Tulsi Plant: మహిళలు తులసి ఆకులు తెంపవచ్చా?

అన్నప్రసాదానికి విరాళం:

దుర్గమ్మవారి ఆలయంలో జరిగే అన్నప్రసాద వితరణకు రు.1లక్షను మేడ్చల్ కు చెందిన ఎంవి రామ్శట్టి దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబసభ్యులు ఆదివారం అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

దుర్గమ్మ సేవలో హైకోర్టు జడ్జి

దుర్గమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఇఓ వికె శీనా నాయక్ శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. దుర్గమ్మవారిని కీర్తిస్తూ ఆదివారం కళావేదికపై సాగిన గానామృతం భక్తులను అలరించింది. జి కొండూరు మండలం కవులూరుకు చెందిన గరిమెల్ల శేషుకుమారి బృందం పలు కీర్తనలను ఆలపించగా వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, ప్రసాదాలు అందించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Temples Durga Temple Giri Pradakshina Hanumat Vratham indrakeeladri Kanaka Durga Temple Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.