ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు, దక్షిణ గోవాలో జరుగుతున్న శ్రీశ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో 550వ వార్షికోత్సవాల్లో పాల్గొని, 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు.
Read Also: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీకి డాక్టర్ షహీన్‌ను తీసుకెళ్లి విచారణ
15,000 మందికి పైగా భక్తులు హాజరు
మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వేడుకల నిర్వాహక కమిటీ సంయుక్త కన్వీనర్ ఎస్. ముకుంద్ కామత్ తెలిపిన వివరాల ప్రకారం, నేడు దేశం నలుమూలల నుండి 15,000 మందికి పైగా భక్తులు హాజరు కావచ్చని అంచనా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: