ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో చారిత్రాత్మక ఘట్టం సాక్ష్యం అయింది. ఎన్నేళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న రామాలయ ధ్వజావిష్కరణ(Modi Flag Hosting) కార్యక్రమం ఘనంగా జరిగింది. గర్భగుడి మీద కాషాయ రంగు ‘ధర్మ ధ్వజం’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున, సీతారాముల కళ్యాణ దినోత్సవానికి గుర్తుగా ఈ ప్రత్యేక కార్యక్రమం అభిజిత్ ముహూర్తంలో నిర్వహించటం ప్రత్యేకత.
ఈ రోజుకే మరో చారిత్రక అనుబంధం ఉంది. 17వ శతాబ్దంలో సిక్కుల ఆరో గురువు తేజ్ బహదూర్ అయోధ్యలో 48 గంటల నిరంతర ధ్యానం పూర్తి చేసి అమరత్వాన్ని పొందిన రోజు కూడా ఇదే. 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ, 2024 జనవరి 22న బాలరాముల ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత, ఆలయంలో జరిగిన ఇదొక ప్రముఖ ఘట్టం.
Read Also: Central Govt: జీఎస్టీలో మరో కీలక మార్పు
ఆలయం గర్భగుడి మీద ఎగురవేసిన కాషాయ పతాకం త్రికోణాకారంలో 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో రూపొందించారు. ఆధ్యాత్మికతకు ప్రతీకగా ‘ఓం’, రాముడి సూర్యవంశానికి గుర్తుగా ‘సూర్యుడు’, కశ్యప మహర్షి సృష్టించిన కోవిదార్ చెట్టు సూచికలను జెండాపై ప్రతిష్ఠించారు. వాల్మీకి రామాయణంలోనూ ఈ పతాకానికి ఉన్న ప్రస్తావన ఆధారంగా ప్రసిద్ధ పరిశోధకుడు లలిత్ మిశ్రా సూచనల మేరకు దీనిని రూపకల్పన చేశారు.
అహ్మదాబాద్‌లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను ప్రత్యేకంగా రూపొందించింది. దీర్ఘకాలం మన్నేలా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, బలమైన పట్టుదారాలతో 25 రోజులపాటు శ్రమించి పతాకాన్ని సిద్ధం చేశారు. రామాలయం నిర్మాణం పూర్తిచేసిన సంకేతంగా ఈ మహోత్సవాన్ని చేపట్టారు.
7 వేల మంది అతిథులతో వైభవం
ధ్వజావిష్కరణ సందర్భంగా ఆలయం(temple) మరియు నగరంలో రోడ్లను 100 టన్నుల పూలతో అద్భుతంగా అలంకరించారు. దాదాపు 7 వేల మంది ప్రత్యేక అతిథులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు హాజరయ్యారు. వారి కోసం 200 అడుగుల వెడల్పుతో భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కూడా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అయోధ్యకు చేరుకున్న మోదీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath), గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో నిర్వహించగా ప్రజలు పూల వర్షంతో స్వాగతం చెప్పారు. తర్వాత ప్రధాని రామజన్మభూమి శేషావతార్ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సప్తమందిర్‌లోని వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, శబరి విగ్రహాలను దర్శించారు. చివరగా బాలరాముడికి గర్భగుడిలో హారతి ఇచ్చి పూజలు చేసి, ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: